Gold Price Today : ఊరించి.. ఊరించి మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఇక బ్రేకులు పడవేమో?

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరల్లో కొంత తగ్గుదల కనిపించింది

Update: 2025-05-11 03:19 GMT

బంగారం ధరలు మరింతగా పెరుగుతున్నాయి. తగ్గినట్లే ఊరించి మళ్లీ నిరాశకు గురి చేస్తున్నాయి. కొందామంటే బంగారం పట్టుకుంటేనే భయమేస్తుంది. అలా ధరలు పెరిగిపోయాయి. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ధరలు పెరగడం ఏ ఏడాది చూడలేదని మార్కెట్ నిపుణులు కూడా చెబుతున్నారు. గతంలో ధరలు పెరిగినా స్వల్పంగా పెరిగేవని, కానీ ఒక్కసారిగా వేల రూపాయలు గ్రాముకు పెరగడంతో పది గ్రాముల బంగారం ధర లక్ష రూపాయలకు చేరుకుని మళ్లీ తగ్గుదల కనిపించినా ఆశించిన రీతిలో మాత్రం తగ్గలేదు. అందుకే వినియోగదారులు ఎవరూ ఇప్పుడిప్పుడే బంగారం, వెండి కొనుగోలుకు ముందుకు వచ్చే అవకాశం కనిపించడం లేదు.

పెరుగుదలకు కారణాలివి...
బంగారం ధరల పెరుగుదలకు అనేక కారణాలున్నాయి. అంతర్జాతీయంగా పెరుగుతున్న ధరల ఒడిదడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు, అమెరికా, చైనా మధ్య ట్రేడ్ వార్ తో పాటు పాక్ - భారత్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కూడా బంగారం ధరల పెరుగుదలకు కారణమని కొందరు చెబుతున్నారు.జ్యుయలరీ దుకాణాలు మంచి సీజన్ లో కొనుగోళ్లు సక్రమంగా లేక వెలవెల బోతుండటంతో ఇంకా బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదన్నది అర్థమవుతుంది. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే మరికొంత ధరలు దిగి రావాల్సి ఉంటుంది.
ధరలు తగ్గి...
బంగారం అంటే ఇప్పుడు అంత మోజు లేదు. కొనాలని కోరిక ఉన్నప్పటికీ ధరలను చూసి మనసును నియంత్రించుకుంటున్నారు. చాలా మందికి కొనుగోలు చేసే శక్తి లేక బంగారం, వెండి కొనుగోళ్లకు దూరంగా ఉండాల్సి వస్తుంది. పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్నప్పటికీ పెద్దగా వ్యాపారాలు లేవని దుకాణాల యాజమాన్యాలు చెబుతున్నాయి. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరల్లో కొంత తగ్గుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఉదయం ఆరు గంటలకు నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 90,450 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 98,640 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 1,11,000 రూపాయలుగా కొనసాగుతుంది.
Tags:    

Similar News