Gold Price Today : మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు..నేటి గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో తెలిస్తే?

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు స్థిరంగా కొనసాుతున్నాయి.

Update: 2025-05-14 03:38 GMT

బంగారం ధరలు మరింత పెరిగే అవకాశమున్నాయని అంటున్నారు. అనేక కారణాలతో బంగారంతో పాటు వెండి ధరలు కూడా అదే స్థాయిలో పెరగనున్నాయి. ధరలు పెరుగుదలతో ఇప్పటికే దాని ప్రభావం అమ్మకాలపై ప్రభావం పడింది. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు దీనికి కారణంగా చెబుతున్నారు. అదే సమయంలో పసిడి, వెండి ధరలు ఇటీవల కాలంలో కొంత తగ్గినప్పటికీ రానున్న కాలంలో ధరలు పెరుగుతాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ధరలు ఎప్పుడు పెరుగుతాయో చెప్పలేమని అంటున్నారు. అందుకే ఇప్పుడే కొనుగోలు చేయడం మంచిదని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. కానీ ధరలు ఇంకా వినియోగదారులకు అందుబాటులోకి రావడం లేదు.

సీజన్ నడుస్తున్నా...
పెళ్లిళ్ల సీజన్ జోరుగా నడుస్తుంది. పెళ్లిళ్ల సీజన్ ఇంకా కొంత కాలం ఉంటుంది. ధరలు ప్రస్తుతం కొంత తగ్గుముఖం పట్టాయి. అయినా బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. దీనికి ప్రధాన కారణం ధరలు ఇంకా తమకు అందుబాటులోకి రావడం లేదన్న కారణమేనని వ్యాపారులు సయితం అంగీకరిస్తున్నారు. ధరలు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా బంగారం, వెండి ధరలు ఈ ఏడాది పెరిగినంత ఎప్పుడూ పెరగలేదు. వ్యాపారులు అనేక రకాలుగా ఆఫర్లు ప్రకటిస్తున్నప్పటికీ ధరలు తమకు అనుకూలంగా లేవని భావించి వినియోగదారులు కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు.
నేటి ధరలు...
బంగారం అంటే స్టేటస్ సింబల్. వెండి కూడా అంతే. బంగారం, వెండి ధరలు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటున్నప్పటికీ ఈ స్థాయిలో అమ్మకాలు పడిపోవడం గతంలో ఎన్నడూ జరగలేదని వ్యాపారులు అంటున్నారు. అందుకే ధరలు ఇంకా తగ్గాలని వ్యాపారులు సయితం కోరుకుంటున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు స్థిరంగా కొనసాుతున్నాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఉదయం ఆరు గంటలకు బంగారం, వెండి ధరలు నమోదయిన ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 88,560 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారంధర 96,610 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 1,08,900 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.


Tags:    

Similar News