Gold Price Today : బంగారం ధరలు మళ్లీ షాకిచ్చాయిగా.. ఈరోజు ధరలు ఎలా ఉన్నాయంటే?
ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరల్లో కూడా స్వల్ప పెరుగుదల కనిపించింది.
బంగారం ధరలు నిత్యం పెరుగుతూనే ఉంటాయి. వెండి ధరలు కూడా పైపైకి ఎగబాకుతూనే ఉంటాయి. బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోవడానికి అనేక కారణాలున్నాయి. ఈ ఏడాది ఆరంభం నుంచే గోల్డ్ ధరలు ఆగడం లేదు. అప్పుడప్పుడు తగ్గుతూ ఊరించినప్పటికీ ఇంకా ప్రజలకు అందుబాటులోకి రాలేదని చెప్పాలి. మరొక వైపు ట్రంప్ అమెరికా అధ్యక్షుడయిన తర్వాత తీసుకున్న నిర్ణయాలు బంగారం ధరలు ఎగబాకడానికి కారణాలుగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అమెరికా - చైనా ట్రేడ్ వార్ కూడా పెరుగుదలకు కారణమని అంటున్నారు. తాజాగా పాక్- భారత్ ల మధ్య ఉద్రిక్తతలు కూడా బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నాయి.
ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో...
బంగారం అంటేనే ఇప్పుడు చాలా మందికి కొనుగోలు చేయడం కష్టంగా మారింది. దాదాపు లక్ష రూపాయలకు చేరువలో ఉన్న బంగారాన్ని కొనుగోలు చేయడం అందరికీ సాధ్యం కాదు. సాధ్యమయ్యే వారు బంగారం పట్ల తక్కువ ఆసక్తి చూపుతారు. మరొక వైపు దేశంలో అలముకున్న యుద్ధమేఘాలతో బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేయడం అవివేకమన్న భావనలో ఉన్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో బంగారం, వెండి ఆభరణాల అమ్మకాలు గణనీయంగా తగ్గిపోయినట్లేనని వ్యాపారులు చెబుతున్నారు. గత కొద్ది రోజుల నుంచి ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ పాక్ - భారత్ ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంకా కొనుగోళ్లపై ప్రభావం ఉంటుందని అంటున్నారు.
మళ్లీ పెరిగి...
బంగారం, వెండి అంటే ఒకప్పుడు సెంటిమెంట్ గా ఉండేది. కానీ దాని గురించి పెద్దగా పట్టించుకోకపోవడమే మంచిదన్న నిర్ణయానికి చాలా మంది వచ్చినట్లే కనపడుతుంది. జ్యుయలరీ దుకాణాలు ఎన్ని ఆఫర్లు ప్రకటిస్తున్నప్పటికీ అటు వైపు చూసేందుకు కూడా వినియోగదారులు మొగ్గు చూపడం లేదు. ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరల్లో కూడా స్వల్ప పెరుగుదల కనిపించింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఉదయం ఆరు గంటలకు నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 91,310 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 99,610 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 1,10,900 రూపాయలుగా కొనసాగుతుంది.