Gold Price Today : తగ్గేదే లేదంటున్న బంగారం..అదే బాటలో వెండి.. ఈరోజు ధరలు ఎలా ఉన్నాయంటే?

ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి.

Update: 2025-08-09 04:17 GMT

బంగారం ధరలు ఎప్పటికీ తగ్గవన్నది అందరికీ తెలుసు. ఎందుకంటే ఒకసారి పెరిగిన బంగారం ధరలు అంతే వేగంగా తగ్గడం అనేది జరగదు. అందుకే బంగారం ధరలు ఇటీవల కాలంలో భగ్గుమంటున్నాయి. ముట్టుకుంటేనే షాక్ తగులుతున్నాయి. అందుకే బంగారం ఇప్పుడు అందరి వస్తువు కాదు. కొందరి వస్తువుగానే మారింది. గత కొద్ది రోజులుగా బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది ఆరంభం నుంచి ధరల పెరుగుదల ఆగడం లేదు. తగ్గకపోగా లక్ష రూపాయలు దాటి పోవడంతో వినియోగదారులు కొనుగోలు చేసేందుకు వెనకడగు వేస్తున్నారు. ఇంతలా ధరలు గతంలో ఎప్పుడూ పెరగలేదని, ఇప్పుడే చూస్తున్నామని మార్కెట్ నిపుణులు కూడా చెబుతున్నారు.

తగ్గుతాయనుకుంటే...
చాలా మంది ధరలు తగ్గుతాయని చెబుతున్నప్పటికీ అది సాధ్యం కావడం లేదు. లక్ష దాటేసిన బంగారం ధర వెండి కూడా అదే స్థాయిలో పరుగులు పెడుతుండటం ఆందోళనకు గురి చేస్తుంది. ఇక పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతుండటంతో పాటు రానున్న నాలుగు నెలల పాటు ఇక ధరలు తగ్గే అవకాశం లేదన్న అంచనాలు కూడా అదే మాదిరిగా వినిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల్లో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, ట్రంప్ సుంకాల మోత వంటి కారణాలతో బంగారం ధరలు మరింత పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.ఇక ధరలు తగ్గే అవకాశం లేదని కూడా అనేక మంది అభిప్రాయపడుతున్నారు.
మళ్లీ పెరిగి...
ప్రధానంగా బంగారం ధరలు భారీగా పెరగడంతో పెట్టుబడి పెట్టే వారు సయితం కాస్త వెనకడుగు వేశారు. దీంతో బంగారం, వెండి ఆభరణాల అమ్మకాలు దారుణంగా పడిపోయాయని వ్యాపారులు లబోదిబోమంటున్నారు. ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. అయితే మధ్యాహ్నానికి ఈ ధరల్లో మార్పులు కనిపించవచ్చు. పెరగవచ్చు. తగ్గవచ్చు. 22 క్యారెట్ల పది గ్రాముల బంగరాం ధర 94,710 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,03,320 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 1,26,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.
Tags:    

Similar News