Gold Price Today : మరొక్కసారి లక్షను దాటేసిన బంగారం.. ఒక కొనలేమేమో?
రోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు కూడా అంతే స్థాయిలో పెరిగాయి.
బంగారం ధరలు మరింత ప్రియమవుతాయి. గత కొద్ది రోజులుగా ధరలు పెరగడం చూస్తుంటే ఇదే అర్థమవుతుంది. ఈ ఏడాదిలో ఇది మూడోసారి లక్ష రూపాయలు పది గ్రాముల బంగారం దాటేసింది. ఏప్రిల్ లో ఒకసారి, మే నెలలో ఒకసారి, ఈరోజు లక్ష రూపాయలు బంగారం ధరలు దాటేయడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. బంగారం కొనే పరిస్థితులు కనిపించడం లేదు. బంగారం అంటే భయం వేస్తుంది. అది యాంటిక్ పీస్ గా మారిపోతుందేమోనన్న భయం అందరిలోనూ వ్యక్తమవుతుంది. అంతధరలు పోసి కొనుగోలు చేసిన బంగారం ధరలు తిరిగి పతనం కావన్న గ్యారంటీ లేకపోవడంతో పెట్టుబడి పెట్టేవారు సయితం బంగారం కొనుగోళ్ల విషయంలో వెనకడుగు వేస్తున్నారు.
సామాన్యులకు అందనంతగా...
బంగారం అంటే సామాన్యులకు అందుబాటులో ఉండాలి. భారతీయ సంస్కృతిలో భాగమైన బంగారం, వెండి వస్తువుల ధరలు సామాన్య, మధ్యతరగతి ప్రజలు అందుబాటులో ఉంటే అప్పుడు కొనుగోలు చేస్తారు. క్రయ విక్రయాలు పెరుగుతాయి. డిమాండ్ కూడా పెరుగుతుంది. ఆషాఢమాసంలోనే లక్ష రూపాయలను బంగారం దాటితే రానున్న శ్రావణ మాసంలో ఇంకెంత ధరలు పెరుగుతాయన్నది అంచనాలకు అందడం లేదు. ఈ నెల 25వ తేదీ నుంచి శ్రావణ మాసం ప్రారంభమై ముహూర్తాలు కూడా ఉండంతో పెళ్లిళ్లు విపరీతంగా జరగనున్నాయి. వివాహ వేడుకల్లో ముఖ్య పాత్రను పోషించే బంగారం ధరలు చూసి తల్లిదండ్రులు కూడా భయపడిపోతున్నారు. బంగారం కంటే భూమి ధరలు తక్కువగా ఉన్నాయన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.
భారీగా పెరిగి...
అయితే బంగారం భారతీయ సమాజంలో సెంటిమెంట్ కావడంతో ఎంతో కొంత కొనుగోలు చేస్తారు. అయితే నామ్ కే వాస్తేగా కొనుగోలు చేస్తారని, జ్యుయలరీ దుకాణాలు ఊహించిన రీతిలో అమ్మకాలు జరిగే అవకాశం లేదని చెబుతున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు కూడా అంతే స్థాయిలో పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఉదయం ఆరు గంటలకు నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 91,700 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,00,040 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 1,26,000 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.