Godl Price Today : బంగారం కొనేవారికి బ్యాడ్ న్యూస్.. ఈరోజు ధరలు ఎలా ఉన్నాయంటే?
ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి
పసిడి ధరలు పైపైకి వెళుతున్నాయి. పసిడితో పాటు వెండి ధరలు కూడా పరుగులు తీస్తున్నాయి. ఏరోజూ ధరలు తగ్గడం అనే మాట వినిపించడం లేదు. పెరగడమే అని ప్రతిరోజూ వినిపిస్తుండటంతో ధరలు ఇక ఆగేటట్లు లేవని స్పష్టంగా అర్థమవుతుంది. బంగారం, వెండి ధరలు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, దేశాల్లో నెలకొన్న ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలతో ధరలు పైపైకి వెళుతున్నాయని అంచనాలు వినపడుతున్నాయి. బంగారం మార్కెట్ గతంలో ఎన్నడూ లేని విధంగా ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది.
ఈ ఏడాదంతా...
బంగారాన్ని కొనుగోలు చేయడం ఇప్పుడు ఆషామాషీ కాదు. అంత సులువైన పని కాదు. ధరలు అందుబాటులో లేకపోవడంతో ఇప్పటికే ఈ ఏడాదంతా అమ్మకాలు గణనీయంగా పడిపోయాయని, దాదాపు గత ఏడాదితో పోలిస్తే డెబ్భయి శాతం అమ్మకాలు పడిపోయాయని చెబుతున్నారు. అత్యవసరం అయితే తప్ప బంగారాన్ని, వెండిని కొనుగోలు చేయడం లేదు. అవసరానికి మించి ఎవరూ బంగారాన్ని కొనుగోలు చేయడానికి మొగ్గు చూపడం లేదు. బంగారాన్ని కొనుగోలు చేయాలంటే పేద, మధ్య తరగతి ప్రజల ఆర్థిక స్థోమత చాలకపోవడం వల్లనే అమ్మకాలు గణనీయంగా పడిపోయాయని వ్యాపారులు చెబుతున్నారు. జ్యుయలరీ దుకాణాలు అనేక ఆఫర్లు ప్రకటిస్తున్న పెరిగిన ధరలతో లాభం లేకుండా పోయిందంటున్నారు.
స్వల్పంగా పెరిగి...
బంగారం స్థానంలో వన్ గ్రామ్ గోల్డ్ తో పాటు బంగారాన్ని పోలిన ఆభరణాలను ధరించి వివాహ వేడుకలకు హాజరవుతున్నారు కానీ, మహిళలు అత్యంత ఇష్టపడే బంగారాన్ని కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు. ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై 140 రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 91,440 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 99,760 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 1,24,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.