Gold Rates Today : షాకింగ్.. టచ్ చేస్తే చాలు.. షాక్ కొట్టినట్లే.. బంగారం ధరలు అలా ఉన్నాయిగా?

ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి

Update: 2025-09-13 03:21 GMT

బంగారం ధరలు పెరుగుతూనే ఉంటాయి. డిమాండ్ తో సంబంధం లేకుండా బంగారం ధరలు పెరుగుతుండటం విశేషం. కొనుగోళ్లు లేకపోయినా సరే బంగారం ధరల పెరుగుదల మాత్రం ఆగడం లేదు. అంతర్జాతీయంగా జరిగే పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు పెరుగుతాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, ట్రంప్ సుంకాల ఎఫెక్ట్ తో బంగారం ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దీనికి తోడు బంగారం దిగుమతులు తగ్గడం ధరల పెరుగుదలకు ఒక కారణంగా చెబుతున్నారు. అందుకే బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ ఏడాది మాత్రం చేదు అనుభవాన్ని మిగిల్చిందనే చెప్పాలి.

జ్యుయలరీ దుకాణాలను...
గత మూడు నెలల నుంచి పెళ్లిళ్లు జోరుగా నడుస్తున్నాయి. మరో మూడు నెలల పాటు పెళ్లిళ్ల సీజన్ ఉంటుంది. అలాగే ముఖ్యమైన పండగలు కూడా ఉన్నాయి. అయినా బంగారం కొనుగోళ్లు ఏ మాత్రం జరగడం లేదు. ధరలు పెరుగుతుండటంతో కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. బంగారాన్ని కొనుగోలు చేయాలంటే ఇప్పుడు ఆషామాషీ కాదు. లక్షల రూపాయలు పెట్టినా తులం బంగారం రావడం కష్టమవుతున్న నేటి రోజుల్లో ఎవరు కొనుగోలు చేస్తారు? అన్న ప్రశ్న తలెత్తుంది. అందుకే బంగారం దుకాణాలు.. ముఖ్యంగా కార్పొరేట్ దుకాణాలు కూడా నిర్వహణ ఖర్చులు కూడా రావడం లేదని, వినియోగదారులు లేక వెలవెల బోతున్నాయని అంటున్నారు.
మళ్లీ పెరిగి...
బంగారం కేవలం సెంటిమెంట్ మాత్రమే కాదు.. స్టేటస్ సింబల్ గా కూడా మారింది. బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేయాలంటే సాధారణ, మధ్యతరగతి జీవులకు సాధ్యం కాదు. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి కిలో ధరపై వంద రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఉదయం ఆరు గంటలకు నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర1,02,010 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,11,290 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 1,42,100 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి ధరల్లో మళ్లీ మార్పులు చోటు చేసుకుంటాయి.


Tags:    

Similar News