Gold Price Today : మళ్లీ ఈరోజు కూడా షాకిచ్చిన బంగారం ధరలు.. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?

ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా కొంత పెరుగుదల కనిపించింది

Update: 2025-06-22 03:26 GMT

బంగారం ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. ధరలు అస్సలు దిగి రావడం లేదు. డిమాండ్ తగ్గినా బంగారం ధరలు తగ్గకపోవడానికి అనేక కారణాలున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, దిగుమతులు తగ్గిపోవడం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు, ఇజ్రాయిల్ - ఇరాన్ ల మధ్య యుద్ధం వంటి కారణాలతో బంగారం ధరలు ఆల్ టైమ్ హైకి చేరుకున్నాయి. ఇప్పటికే పది గ్రాముల బంగారం ధర లక్ష రూపాయలు దాటేసింది. కిలో వెండి ధర 1,20 లక్షలకు చేరుకుంది. ఇలా గతంలో ఎన్నడూ ధరలు పెరగలేదని, అందుకే కొనేవాళ్లు లేక బంగారం దుకాణాలు వెలవెలబోతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.

డిమాండ్ తగ్గినా...
గతంలో పెళ్లిళ్ల సీజన్ లో బంగారం కొనుగోళ్లు ఎక్కువగా ఉండేవి. రానురాను ప్రజల్లో కొనుగోలు శక్తి కొంత పెరగడంతో పుట్టినరోజు, పెళ్లి రోజున కూడా బహుమతుల రూపంలో బంగారు వస్తువులను కానుకగా ఇచ్చేవారు. భార్య కళ్లల్లో ఆనందం చూడటానికి కష్టమైనా పసిడిని కొనుగోలు చేసేవారు. మహిళలకు బంగారం అంటే అదొకరకమైన బలహీనత కావడంతో భర్తలు కూడా వారి మనసు నొప్పించకుండా కొనేవారు. అందుకే భారత్ లోనూ, అందులోనూ దక్షిణ భారత దేశంలో గల్లీకొక కార్పొరేట్ బంగారం దుకాణాలు వెలిశాయి. అయితే ఈ ఏడాది నుంచి పెళ్లిళ్ల సీజన్ లో కూడా అమ్మకాలు దారుణంగా పడిపోయాయని వ్యాపారులు లబోదిబో మంటున్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి చూడలేదంటున్నారు.
నేటి ధరలివీ...
వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఆఫర్లు ప్రకటించినా ఫలితం లేదు. ఇప్పుడు సీజన్ ముగిసింది. ఇక ఈ రేంజ్ లో ఉన్న ధరలను పెట్టి బంగారం కొనుగోలు చేయడం మాత్రం జరిగే పని కాదని వినియోగదారులు అంటున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా కొంత పెరుగుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై మూడు వందల రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఉదయ ఆరు గంటలకు నమోదయిన ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 92,350 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,00,750 రూపాయలు పలుకుంది. కిలో వెండి ధర 1,20,000 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.


Tags:    

Similar News