Gold Price Today : మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు.. ఎంత పెరిగాయో తెలిస్తే?
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి.
బంగారం ధరలు మరింతగా ప్రియమవుతాయి. ధరలు ఎంత పెరిగినా గతంలో డిమాండ్ తగ్గేది కాదు. కానీ ఈ ఏడాదిలో ధరలు ఎన్నడూ లేనంతగా పెరుగుుతుండటంతో బంగారం అమ్మకాలపై ప్రభావం పడుతుంది. ధరలు దిగివస్తాయని ఎదురు చూసిన వారికి నిరాశ ఎదురవుతుంది. ధరలు అదుపులోకి రావడం ఎవరి చేతుల్లో ఉండదని, అనేక కారణాలతో ధరలు పెరుగుతాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అనేక కారణాలు ధరల పెరుగుదలపై ఉన్నప్పటికీ చివరకు దాని ప్రభావం మాత్రం బంగారం కొనుగోళ్లపై పడింది. సీజన్ తో సంబంధం లేకుండా ధరలు పెరగడం ఒక్క బంగారం విషయంలోనే జరుగుతుంది. అందుకే ఇలాంటి పరిస్థితి ఉందని చెబుతున్నారు.
కొనుగోలు చేయాలంటే....
బంగారం అంటే అంతే మరి. ధరలు తగ్గుతూ ఊరిస్తున్నప్పటికీ అంత స్థాయిలో ధరలు తగ్గలేదన్నది వినియోగదారుల అభిప్రాయం. ఎందుకంటే ధరలు తగ్గినట్లే తగ్గి పెరుగుతుండటం గోల్డ్ లవర్స్ కు నిరాశ కలిగిస్తుంది. అందుకే బంగారం వైపు చూడటానికి కూడా భయపడి పోతున్నారు. అలాంటి సమయంలో ధరలు ఇంకా పెరుగుతాయన్న మార్కెట్ నిపుణుల హెచ్చరికలు నిజమయ్యేటట్లే కనిపిస్తున్నాయి. గ్రాము బంగారం కొనుగోలు చేయాలన్నా సాధ్యం కాని పరిస్థితి. వేల రూపాయలు వెచ్చింది పసిడిని కొనుగోలు చేయడం అనేది శక్తికి మించిన భారంగా మారనుందని మధ్య, దిగువ మధ్యతరగి ప్రజలు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే అమ్మకాలు దారుణంగా పడిపోయాయి.
భారీగా పెరిగి...
బంగారం అంటే ఒకప్పుడు అందరికీ అందుబాటులో ఉన్న వస్తువు. ఇప్పుడు ఎవరికీ అందకుండా పోతుంది. ధరలు అంతగా పెరగడంతో బంగారం వైపు చూడటమే మానుకున్నారు. పెళ్లిళ్ల సీజన్ ముగియనుండటంతో ఇక ఆ కాస్త అమ్మకాలు కూడా జరిగే అవకాశాలు కనిపించవని వ్యాపారులు అంటున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి దరలు స్వల్పంగా పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై పదిహేను వందల రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఉదయం ఆరు గంటలకు నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 90,610 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 98,850 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 1,11,100 రూపాయలకు చేరుకుంది.