Gold Price Today : ముట్టుకుంటే కరెంట్ షాక్ తగిలినట్లే.. మళ్లీ లక్షకు చేరువలో బంగారం
ఈరోజు దేశంలో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. వెండి ధరలు మాత్రం తగ్గాయి.
బంగారం ధరలు మండిపోతున్నాయి. ముట్టుకుంటే కరెంట్ షాక్ తగిలినట్లు తగులుతుంది. ధరలు పెరుగుతుండటమే కాని బంగారం ధరలు తగ్గడం అనేది సాధారణంగా అరుదుగా జరుగుతుంటుంది. ఇక లక్ష రూపాయలు దాటేసే సమయం ఎంతో దూరం లేదని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. అందుకే ఇప్పుడే కొనుగోలు చేయడం మంచిదని సూచిస్తున్నారు. బంగారం, వెండి ధరలుకు అస్సలు కళ్లెం పడటం లేదు. బ్రేకులు పడటం లేదు. ప్రతి రోజూ ధరలు పెరుగుతూ కొనుగోలు దారులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. లక్ష రూపాయలు దాటిందంటే మళ్లీ కొనుగోళ్లు మందగిస్తాయని కూడా వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. వెండి ధరలు కూడా పెరుగుతుండటంతో కొనుగోళ్లు తగ్గాయి.
ఈసారి కూడా...
మొన్నటి వరకూ పెళ్లిళ్ల సీజన్ జోరుగా నడిచింది. అయినా బంగారం కొనుగోళ్లు అంతంత మాత్రమే జరిగాయి. అందుకు కారణం బంగారం ధరలు భారీగా పెరగడమే. మళ్లీ వివాహాల సీజన్ ఈ నెల 25వ తేదీ నుంచి ప్రారంభమయి దాదాపు నాలుగు నెలల పాటు అంటే నవంబరు నెల వరకూ కొనసాగుతుంది. లక్షలాది పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పెళ్లిళ్ల సమయంలో మళ్లీ బంగారం ధరలు లక్ష రూపాయలు దాటాయంటే మాత్రం మళ్లీ గత సీజన్ పరిస్థితి లానే ఉంటుందని వ్యాపారులు భయపడిపోతున్నారు. అందుకే పెద్దగా స్టాక్ ను కూడా తెప్పించుకోకూడాదని భావిస్తున్నారు. ధరలు తగ్గితే తప్ప అమ్మకాలు ఊపందుకోవని, కానీ అది మాత్రం ఈ ఏడాది డిసెంబరు వరకూ జరిగేటట్లు లేదని అంటున్నారు.
వెండి ధరలు మాత్రం...
పెళ్లిళ్లు, శుభకార్యాలకు బంగారాన్ని ఖచ్చితంగా భారతదేశంలో కొనుగోలు చేస్తారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు అనుసరించి బంగారాన్ని ఎక్కువగా శుభకార్యాలలో వినియోగిస్తారు. కానీ ధరలను చూసి వెనకడుగు వేస్తున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. వెండి ధరలు మాత్రం తగ్గాయి.పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 91,540 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 99,700 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 1, 20, 100 ట్రేడ్ అవుతుంది.