Gold Price Today : షాకిస్తున్న బంగారం ధరలు.. ఈరోజు ధరలు ఎంత పెరిగాయంటే?
ఈరోజు దేశంలో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి
బంగారం ధరలు మరింతగా పెరుగుతాయన్న అంచనాలు నిజమవుతున్నట్లే కనిపిస్తున్నాయి. ధరలు ఏమాత్రం తగ్గడం లేదు. వరసగా గోల్డ్ రేట్స్ పెరుగుతుండటంతో వినియోగదారులు బంగారం కొనేందుకు దూరమవుతున్నారు. మధ్యతరగతి ప్రజలకు బంగారం భారంగా మారింది. బంగారం ధరలు తగ్గుతాయని ఎవరు చెప్పారో కానీ, గత కొన్ని రోజుల నుంచి అస్సలు తగ్గడం లేదు. కొన్ని రోజులు మాత్రమే కాదు. గత ఐదు నెలల నుంచి అంటే దాదాపు ఈ ఏడాది ప్రారంభం నుంచి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. పెళ్లిళ్ల సీజన్ కూడా నడుస్తుండటంతో ధరలు పెరగడంతో కొందరు కొనలేక కొంటుండగా, మరికొందరు మాత్రం అవసరానికి మించి కొనుగోలు చేయకుండా జాగ్రత్తలు పడుతున్నారు.
సీజన్ ముగుస్తుండటంతో...
పెళ్లిళ్ల సీజన్ దాదాపు పూర్తి కావచ్చింది. మూఢమి కొన్నాళ్లు ఉంటుంది. ఈ పరిస్థితుల్లో బంగారం, వెండి ధరలు పెరిగితే కొనుగోలు చేయడం కష్టమేనని వ్యాపారులు కూడా భావిస్తున్నారు. బంగారం ధరలు పెరగడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, యుద్ధాలతో పాటు అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికయిన తర్వాత తీసుకున్న నిర్ణయాలతోనే ధరలు పైపైకి ఎగబాకుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. లక్ష రూపాయలకు చేరువలోకి బంగారం రావడంతో పాటు వెండి ధరలు అయితే అస్సలు దొరకకుండా పోతున్నాయి.
ధరలు మళ్లీ పెరిగి...
బంగారం, వెండి ధరలు ఇలా పెరిగిపోతుండటంతో క్రయవిక్రయాలు జరగకపోయినా డిమాండ్ అనేది లేకుండా పోయింది. అత్యవసరం అయితే తప్ప కొనుగోలు చేయడం లేదు. అదీ శుభకార్యాలకు కావాల్సినంత మాత్రమే కొనుగోలు చేస్తుండటంతో బంగారం అమ్మకాలు దాదాపుగా నిలిచిపోయాయి. ఈరోజు దేశంలో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి . పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఉదయం ఆరు గంటలకు ఇలా నమోదయ్యాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 91,310 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 99,610 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 1,04,100 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది