Gold Rates Today : గుడ్ న్యూస్ భారీగా తగ్గిన బంగారం ధరలు...దిగిరాకపోతే ఎవరు మాత్రం కొంటారు సామీ?
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి.
ఏ వస్తువయినా ధరలు అందుబాటులో ఉంటేనే ఎవరైనా కొనుగోలు చేస్తారు. తమకు శక్తికి మించిన విధంగా ధరలు ఉంటే మాత్రం అటువైపు చూడరు. బంగారం విషయంలో అదే జరుగుతుంది. గత ఐదు నెలల నుంచి బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది ఆరంభం నుంచి ప్రారంభమయిన బంగారం ధరల్లో పెరుగుదల మొన్నటి వరకూ ఆగలేదు. అందుకే కొనుగోళ్లు భారీగా మందగించాయి. అమ్మకాలు నిలిచిపోవడంతో పాటు పెళ్లిళ్ల సీజన్ కూడా ముగియనుండటంతో ఆ కాస్త కొనుగోలు చేసే వారు సయితం బంగారు దుకాణాల వైపు చూడటం లేదు. జ్యుయలరీ దుకాణాలు ఎన్ని ఆఫర్లు ప్రకటిస్తున్నప్పటికీ పెరిగిన ధరలు చూసి వెనుకంజ వేస్తున్నారు.
లక్షను టచ్ చేసి వచ్చి...
మే నెలలో లక్ష రూపాయలు దాటేసిన బంగారం ధరలు తర్వాత కొద్దిగా తగ్గుముఖం పట్టినా జూన్ నెలలో మళ్లీ పది గ్రాముల బంగారం ధరలు లక్ష రూపాయలను టచ్ చేశాయి. అయితే గత ఐదు రోజులుగా క్రమంగా ధరలు తగ్గుముఖం పట్టాయి. డిమాండ్ తగ్గిపోవడంతో పాటు కొనుగోళ్లు దారుణంగా పడిపోవడం కూడా బంగారం ధరలు పతనమవ్వడానికి కారణాలుగా చెబుతున్నారు. మరొకవైపు అంతర్జాతీయంగా పెరుగుతున్న దరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం వంటివి కూడా బంగారం, వెండి ధరల్లో మార్పునకు కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇరాన్ - ఇజ్రాయిల్ మధ్య యుద్ధం ఆగిపోవడం కూడా ధరలు తగ్గడానికి కారణమని అంటున్నారు.
భారీగా తగ్గి...
బంగారం కొనాలంటే పుష్కలంగా కాసులు కావాలి. కొనుగోలు శక్తి ఉన్న వారు మాత్రమే బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తుంటారు. పెట్టుబడి పెట్టే వారు సయితం పెరుగుతున్న ధరలను చూసి వెనక్కు తగ్గుతున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఉదయం ఆరు గంటలకు నమోదయిన ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 89,150 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 93,610 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర ప్రస్తుతం 1,19,000 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది.