Gold Price Today : పసిడి ప్రియులకు భారీ ఊరట.. బంగారం ధరలు ఎంత తగ్గాయో తెలుసా?
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి
బంగారం ధరలు మరింత పెరుగుతాయన్న అంచనాలు కొంత నిజమవుతున్నప్పటికీ అప్పుడప్పుడు ధరలు తగ్గుతూ ఊరిస్తున్నాయి. ధరలు తగ్గినప్పుడల్లా కొనుగోలు చేయాలని అందరూ భావిస్తారు. కానీ అంత పెద్ద స్థాయిలో మాత్రం ధరలు తగ్గడం లేదు. ధరలు పెరిగిన స్థాయిలో తగ్గినప్పుడు ధరలు ఉండటం లేదు. ఎందుకో గాని బంగారం భారీగా అప్పుడప్పుడే ధరలు తగ్గుతాయి. ఇక తరచూ తగ్గిన ధరలు అసలు తగ్గినట్లు కాదు. పది గ్రాముల బంగారం ధరపై కేవలం పది రూపాయలు మాత్రమే తగ్గితే మధ్యతరగతి ప్రజలకు ఏ మాత్రం ఉపయోగం ఉండదని, వారు జ్యుయలరీ దుకాణాల వైపు కూడా చూడరని వ్యాపారులే అంగీకరిస్తున్నారు.
ఈ కారణాలతో...
ఈ ఏడాది మొదటి తేదీ నుంచి బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. భారీగా పెరిగిన ధరలు పది గ్రాముల బంగారం ధర లక్ష రూపాయలకు చేరుకుని మళ్లీ దిగి వచ్చింది. నేడు కొంత ఊరట లభించినట్లేనని చెప్పాలి. యూఎస్ డాలర్ బలపడటంతో పాటు, ఆసియా మార్కెట్ లో బంగారానికి డిమాండ్ తగ్గడం, పండగలు, వివాహాలకు కూడా కొనుగోళ్లు మందగించడం, కేంద్ర ప్రభుత్వం విధించిన పన్నులు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలతో అనేక కారణాలు కలగలిపి బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇదే సమయంలో బంగారంపై పెట్టుబడి పెట్టే వారు కూడా ఇటీవల కాలంలో చాలా వరకూ తగ్గిపోయారని అంటున్నారు.
ధరలు తగ్గి...
బంగారం అంటే మక్కువ చూపే మహిళలు కూడా ధరలను చూసి కొనుగోలు చేయడానికి ముందుకు రాకపోవడంతోనే డిమాండ్ తగ్గింది. అందువల్ల ధరలు ఇంకా దిగివస్తాయని చెబుతున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. పది గ్రాముల బంగారం ధరపై 510 రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఉదయం ఆరు గంటలకు నమోదయిన ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 87,100 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 95,020 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 1,07,900 రూపాయలుగా నమోదయింది.