Gold Price Today : గుడ్ న్యూస్ ...బంగారం ధరలు తగ్గుతున్నాయ్

దేశంలో నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది

Update: 2025-06-30 03:38 GMT

బంగారం ధరలు గత కొద్ది రోజుల నుంచి నేల చూపులు చూస్తున్నాయి. క్రమంగా దిగి వస్తున్నాయి. లక్ష రూపాయలకు పైగానే చేరుకున్న బంగారం ధరలు క్రమంగా దిగి రావడం ఒకరకంగా వినియోగదారులకు ఊరట అని చెప్పాలి. గత నాలుగు రోజుల నుంచి బంగారం, వెండి ధరలు దిగి వస్తున్నాయి. ధరలు ఎంత తగ్గాయని అని అనే కన్నా అందుబాటులోకి ధరలు వచ్చాయా? అన్న దానిపైనే ఎక్కువ మంది ఆరా తీస్తున్నారు. ధరలు ఒక్కసారిగా పెరగడంతో ఆ స్థాయిలో ధరలు తగ్గడం అనేది జరగకపోయినా సామాన్యులు కొనుగోలు చేయగలిగిన స్థాయికి చేరుకుంటే చాలు అని భావిస్తున్నారు. వ్యాపార వర్గాలు కూడా ఇదే అభిప్రాయంలో ఉన్నారు.

అందుబాటులోకి వచ్చాయా?
బంగారం ధరలు ఎప్పుడూ ప్రియంగానే ఉంటాయి. సీజన్ తో సంబంధం లేకుండా పెరుగుతుంటాయి. ఎందుకంటే బంగారానికి ఉన్న డిమాండ్ అలాంటిది. బంగారం విషయంలో మాత్రం మహిళలు రాజీ పడరు. సెంటిమెంట్ కూడా జత కావడంతో బంగారం, వెండి ఆభరణాలను కొనుగోలు చేసే వారి సంఖ్య ఎప్పుడూ ఉంటుంది. ఇక పెట్టుబడి పెట్టే వారు సయితం బంగారంపై పెట్టుబడి సురక్షితమని భావించి దానిపై డబ్బులు పెడతారు. కానీ గత కొన్నాళ్ల నుంచి పెట్టుబడిదారులు కూడా ధరల పెరుగుదల చూసి పెట్టుబడి పెట్టేందుకు కొంత వెనకడుగు వేస్తున్నారు. అనేక కారణాలతో బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
స్వల్పంగా తగ్గి...
బంగారం అంటే ఇప్పుడు సామాన్యులకు అందుబాటులో లేదు. సెలబ్రిటీలకు మాత్రమే దొరికే వస్తువుగా మారింది. అయితే ధరలు తగ్గితే కొనుగోళ్లు పెరుగుతాయని భావిస్తున్నారు. దేశంలో నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై 150 రూపాయల వరకూ తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఉదయం ఆరు గంటలకు నమోదయిన ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 89,290 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 97,410 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 1, 17, 700 రూపాయలుగా కొనసాగుతుంది.





Tags:    

Similar News