Gold Price Today : గోల్డ్ లవర్స్ కు గుడ్ న్యూస్.. నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
దేశంలో నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు స్వల్పగా పెరిగాయి
బంగారం ధరలు మరింత పెరుగుతాయన్న అంచనాలతో పసిడిప్రియులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే శక్తికి మించిన ధరలు ఉన్నాయి. ముఖ్యంగా భారతీయ మహిళలు అత్యంత ఎక్కువగా ఇష్టపడే బంగారాన్ని కొనుగోలు చేయడానికి ముందుకు రావాలంటే కేవలం డిజైన్లు మాత్రమే సరిపోవు. సరిపడా ధరలు ఉండాల్సిందే. అయితే బంగారం ధరలు ఈ ఏడాదిలో వినియోగదారులకు చుక్కలు చూపుతున్నాయి. ధరలు పెరగడమే తప్పించి తగ్గడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. బంగారం అంటే బాగా ఇష్టపడే వారు సయితం దానిని ముట్టుకోవాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. అందుకే జ్యుయలరీ దుకాణాల్లో గణనీయంగా అమ్మకాలు తగ్గాయి.
అనేక కారణాలతో...
ఇక బంగారం, వెండి ధరలకు అనేక కారణాలు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో చోటే చేసుకున్న పరిణామాలు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం వంటి కారణాలు ధరల పెరుగుదలకు కారణాలుగా చెబుతున్నారు. యుద్ధాలు నిలిచిపోయినా ధరల పెరుగుదల మాత్రం ఆగడం లేదు. లక్ష రూపాయలకు చేరువలో ఉండటంతో బంగారం ధరలు ఎంత ప్రియమో వేరే చెప్పాల్సిన పనిలేదు. వెండి ధరలు కూడా అదే రేంజ్ లో కొనసాగుతున్నాయి. అందుకే ధరలు పెరుగుదలను చూసి పెట్టుబడి పెట్టే వారు సయితం బంగారం, వెండి కొనుగోలుకు ముందుకు రావడం లేదు. ఆరు నెలల నుంచి కొనుగోళ్లు జరగక వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు.
స్వల్పంగా పెరిగి...
ఇక సీజన్ తో సంబంధం లేకుండా బంగారం ధరలు పెరుగుతూనే ఉంటాయి. అయితే ప్రస్తుతం ఆషాఢమాసంలో బంగారం కొనుగోళ్లు పెద్దగా జరగవు. అయినాసరే ధరల పెరుగుదల మాత్రం ఆగడం లేదు. దేశంలో నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు స్వల్పగా పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఉదయం ఆరు గంటలకు నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 90,490 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 98,720 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 1,19,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.