Gold Price Today : గోల్డ్ లవర్స్ కు గుడ్ న్యూస్... బంగారం ధరలు నేడు ఎలా ఉన్నాయంటే?

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు స్వల్పంగా పెరిగింది.

Update: 2025-06-11 03:54 GMT

పసిడి ధరలు మోత మోగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంత మాదిరిగా బంగారం ధరలు పెరిగాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి ధరల పెరుగుదల ప్రారంభమై నేటికీ కొనసాగుతుంది. సీజన్ తో సంబంధం లేకుండా ధరలు పెరగడం ఒక్క బంగారం, వెండి విషయంలోనే చూస్తాం. అలాగే డిమాండ్, సప్లయ్ సూత్రం కూడా బంగారం, వెండిలకు వర్తించవు. అయితే అనేక కారణాలతో బంగారం, వెండి ధరలు పెరుగుతాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అందులో అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, యుద్ధాలు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపాయి.

తగ్గే అవకాశం లేదట...
పెళ్లిళ్ల సీజన్ కూడా దాదాపుగా ముగిసింది. బంగారం ధరలు గత ఏప్రిల్ నెలలో పది గ్రాములు లక్ష రూపాయలు చేరుకోవడంతో ఇక లక్షకు పైమాటే ఉంటుందని అందరూ భావించారు. కానీ అందరి అంచనాలకు భిన్నంగా గత కొంతకాలంగా మాత్రం బంగారం ధరలు క్రమేపీ తగ్గి కొంచెం అటు ఇటుగా లక్ష రూపాయలుగా నమోదయింది. అయినా ధరలు ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో కొనుగోలు చేయడానికి ఎవరూ ఆసక్త చూపడం లేదు. గ్రాము బంగారం కొనుగోలు చేయాలన్నా గగనంగా మారిపోయే పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో త్వరలోనే ధరలు మరింత దిగుతాయన్న ప్రచారాన్ని నమ్మవద్దని, ఇంకా పెరిగే అవకాశముందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
స్వల్పంగా తగ్గి...
ధరలు భారీగా పతనమవుతాయని పెట్టుబడి పెట్టేవారు సయితం వెనుకంజ వేస్తున్నారు. కొనుగోలు చేయడానికి కొంత వెయిట్ చేస్తున్నారు. కొందరయితే బంగారంపై పెట్టుబడి పెట్టకుండా ప్రత్యామ్నాయంపై దృష్టిసారించారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు స్వల్పంగా పెరిగింది. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గగా, కిలో వెండి ధరపై వంద రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఉదయం ఆరు గంటలకు నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 89,440 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 97,530 రూపాయలుగా ఉంది. వెండి ధరలు 1,09,100 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది.
Tags:    

Similar News