Gold Price Today : గుడ్ న్యూస్.. బంగారం ధరలు తగ్గాయ్.. ఈరోజు ధరలు ఎలా ఉన్నాయంటే?
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొద్దిగా తగ్గుదల కనిపించింది
బంగారం ధరలు చుక్కలు అంటుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. అసలు కొనలేని పరిస్థితుల్లో కనకం ఉందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. లక్ష రూపాయలకు పది గ్రాముల బంగారం టచ్ చేసి వచ్చి కిందకు దిగినప్పటికీ నేటికీ ధరలు మాత్రం అందుబాటులోకి రాలేదు. దీంతో పాటు మరో పది రోజుల్లో పెళ్లిళ్ల సీజన్ కూడా పూర్తి కావస్తుండటంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. సీజన్ లోనే అమ్మకాలు దారుణంగా తగ్గిపోతే, ఇక అన్ సీజన్ లో బంగారం దుకాణాలు నిర్వహణ ఎలా అన్న భయంతో వారు ఆవేదన చెందుతున్నారు. బంగారం, వెండి ధరలు ఇంత భారీగా పెరగడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది.
గతంలో ఎన్నడూ లేని...
గతంలో ఎప్పడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదని వ్యాపారులు కూడా చెబుతున్నారు. వచ్చే అరాకొరా వినియోగదారులు ధరలు చూసి కొనుగోలు చేయకుండానే వెనుదిరిగిపోతున్నారు. బంగారం ధరలు పెరిగినప్పుడు భారీగా, తగ్గినప్పుడు తక్కువగా ఉండటం మామూలే అయినా అసలు కొనేటట్లు లేవని, తమ ఆర్థిక పరిస్థితి బంగారం కొనుగోలు చేయడానికి సరిపోదని వెనక్కు తిరిగి వెళ్లిపోతున్నారు. అవసరాల కోసం వచ్చిన వారు కూడా కొంచెం కొనుగోలు చేస్తూ షాపుల యజమానులకు షాక్ లు ఇస్తున్నారు. అలాగే దక్షిణ భారత దేశంలో పెళ్లిళ్ల సీజన్ లోనూ, మంచి ముహూర్తాలు ఉన్నప్పుడు బంగారం ధరలు మరింతగా పెరుగుతాయి. అదే సమయంలో ధరలు కూడా పెరుగుతుంటాయి.
స్వల్పంగా తగ్గి...
కానీ ఈసారి డిమాండ్ తో సంబంధం లేకుండానే బంగారం, వెండి ధరలు పెరిగిపోతుండటం ఎవరికీ అర్థం కావడం లేదు. అంతర్జాతీయంగా జరిగే పరిణామాలు కూడా బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొద్దిగా తగ్గుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఉదయం ఆరు గంటలకు ఇలా ఉన్నాయి. మధ్యాహ్నానికి ధరల్లో మార్పులు కనిపించవచ్చు. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 89,340 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 97,470 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది. కిలో వెండి ధర 1,10,900 రూపాయలుగా కొనసాగుతుంది.