Gold Price Today : గోల్డ్ లవర్స్ కు నేడు గుడ్ న్యూస్.. కొనుగోలుకు మంచి సమయమిదే

ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొద్దిగా తగ్గుదల కనిపించింది

Update: 2025-04-16 03:23 GMT

బంగారం ధరలు మరింత పెరుగుతాయన్న అంచనాలు నిజమయ్యేటట్లే కనిపిస్తున్నాయి. ఇప్పటికే పది గ్రాముల బంగారం ధర 96 వేల రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర లక్షా తొమ్మిది వేల రూపాయలుగా నమోదయింది. ఇంత ధరలు పెరగడం గతంలో ఎన్నడూ చూడలేదు. ధరలు తగ్గుతాయన్న అంచనాలు నిజం కాకపోగా, బంగారం, వెండి ధరలు ఇంకా పెరుగుతుండటంతో వినియోగదారులు షాక్ కు గురవుతున్నారు. పెళ్లిళ్లు, శుభకార్యాలు ముమ్మరంగా జరుగుతుండటంతో ఇంకా ధరలు పెరుగుతాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అనేక కారణాలతో బంగారం, వెండి ధరలు పెరుగుతున్నా వాటిని కొనుగోలు చేయడానికి ముందుకు రాకపోవడంతో అమ్మకాలు దారుణంగా పడిపోయాయి.

అక్షర తృతీయ కూడా...
ఇక అక్షర తృతీయ కూడా ముందుంది. అక్షర తృతీయకు గ్రాము బంగారాన్ని అయినా కొనుగోలు చేయాలని అంటారు. ఇందుకోసం వ్యాపారులు అనేక ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ఇప్పటి నుంచే అక్షర తృతీయ కోసం స్పెషల్ ఆఫర్లతో భారీగా ప్రకటనలు గుప్పిస్తున్నారు. కానీ అంత ధరలు పెట్టి కొనుగోలు చేయలేక కాళ్లు జ్యుయలరీ వైపు పడటం లేదు. ఈ ఏడాది మొదటి నుంచి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ ఏడాదిలోనే పది గ్రాముల బంగారం ధర లక్ష రూపాయలకు చేరుకుంటుందన్న అంచనాలు నిజమయ్యేటట్లే కనిపిస్తుంది. మరొక వైపు సోషల్ మీడియాలో భారీగా బంగారం, వెండి ధరలు పతనమవుతాయన్న ప్రచారం కూడా జరుగుతుంది. అందుకే చాలా మంది తగ్గుతాయేమోనని వెయిట్ చేస్తున్నారు.
స్వల్పంగా తగ్గి...
బంగారం, వెండి అంటే అందరూ ఇష్టపడతారు. తమకు గౌరవం పది మందిలో లభించాలంటే బంగారం ఉండాలని అనుకుంటారు. అలాగే జీవితానికి భద్రత కావాలంటే బంగారం మన చెంత ఉండాలన్న బలమైన కోరిక అందరిలోనూ ఉంటుంది. కానీ ధరలు పెరుగుదలతో వాటిని కొనుగోలు చేయడానికి కాస్త వెనుకంజ వేస్తున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొద్దిగా తగ్గుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. మధ్యాహ్నానికి ధరలు మారవచ్చు. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 87,190 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 95,170 రూపాయలుగా కొనసాగుతుంది. ఇక కిలోవెండిధర 1,09,700 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.


Tags:    

Similar News