Gold Price Today : గోల్డ్ లవర్స్ కు అదిరిపోయే న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధరలు

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా కొంత తగ్గుముఖం పట్టాయి

Update: 2025-05-19 03:35 GMT

బంగారం ధరలు నిత్యం పెరుగుతూనే ఉంటాయి. ధరలు పెరుగుదల వినియోగదారులను ప్రతిరోజూ షాక్ కు గురి చేస్తూనే ఉంటుంది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా పసిడి ధరలు పెరుగుతుండటం ఒకింత ఆందోళన కలిగిస్తుంది. ఈ ఆందోళన కేవలం కొనుగోలు దారుల్లో మాత్రమే కనిపించడం లేదు. వ్యాపారుల్లోనూ కనిపిస్తుంది. ఎందుకంటే ధరలు పెరిగిన కొద్దీ అమ్మకాలు తగ్గిపోతుండటంతో వ్యాపారులు బంగారం, వెండి ధరలు దిగి రావాలని కోరుకుంటున్నారు. అదే సమయంలో అనేక అంతర్జాతీయ పరిణామాలు,విదేశాల్లో నెలకొన్న మాంద్యం, ధరల్లో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి అంశాలు బంగారం ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

ఆసక్తి చూపని...
బంగారం ధరలు ఈ ఏడాది నుంచి పరుగు ప్రారంభించింది. వెండి ధరలు కూడా లక్ష రూపాయలు దాటి మధ్యతరగతి ప్రజలకు అందకుండా ఉన్నాయి. పెళ్లిళ్ల సీజన్ అయినప్పటికీ ధరలు అందుబాటులో లేకపోవడంతో కొనుగోలు చేయడానికి ఎవరూ ఆసక్తి చూపడం లేదు. మరొకవైపు జ్యుయలరీ దుకాణాలు తమ దుకాణాల్లో ఉన్న స్టాక్ ను వదిలించుకోవడానికి అనేక ఆఫర్లు ప్రకటిస్తున్నా అటు వైపు చూసేందుకు జంకుతున్నారు. ఇది కొనుగోలుకు సరైన సమయం కాదని భావించి వెనక్కు తగ్గుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే తాము దుకాణాలను మూసివేసుకోవాల్సి వస్తుందని కొందరు వ్యాపారులు లబోదిబోమంటున్నారు. చిన్న తరహా బంగారు దుకాణాల యజమానులపై ఈ ప్రభావం పడుతుంది.
స్వల్పంగా తగ్గి...
దక్షిణ భారత దేశంలో బంగారానికి ఎక్కువగా డిమండ్ ఉంటుంది. సీజన్ తో సంబంధం లేకుండా ప్రతి పండగకు, పుట్టిన రోజుకు కూడా కొనుగోలు చేయడం అలవాటుగా మార్చుకున్నారు. సంస్కృతీ సంప్రదాయాల మేరకు బంగారం, వెండి వస్తువులు కొనుగోలు చేస్తే శుభమని భావించి ఇక్కడ కొనుగోలు చేస్తారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా కొంత తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఉదయం ఆరు గంటలకు నమోదయిన వివరాలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 87,190 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగరాం ధర 95,120 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 1,07,900 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.


Tags:    

Similar News