Gold Price Today : ఈ ఏడాది పసిడి ప్రియులకు బ్యాడ్ టైమ్ .. ధరలు ఇలా పెరుగుతుంటే?

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి

Update: 2025-09-15 03:49 GMT

బంగారం ధరలు ఇటీవల కాలంలో ఎక్కువగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది బంగారం ప్రియులకు బ్యాడ్ టైమ్ అనే చెప్పాలి. ఇప్పటి వరకూ ఒక్క ఏడాదిలో ఇంత భారీ స్థాయిలో బంగారం ధరలు పెరగలేదు. కానీ 2025 ఏడాది మాత్రం బంగారం ధరలు చుక్కలు చూపించాయి. అదే సమయంలో వెండి ధరలు కూడా గతంలో లేనంత స్థాయిలో పైకి ఎగబాకుతున్నాయి. బంగారం, వెండి ధరలు ఇలా పెరుగుతుండటం మంచిది కాదని ట్రేడ్ నిపుణులు చెబుతున్నప్పటికీ ఇది ఎవరి చేతుల్లోనూ ఉండదని కూడా చెబుతున్నారు. ప్రపంచంలో జరిగే అనేక పరిణామాలతో ధరల్లో భారీగా పెరుగుదల ఉందని వాణిజ్య వర్గాలు చెబుతున్నాయి. ధరలు మరింత పెరిగే అవకాశముందని కూడా చెబుతున్నారు.

అపురూపంగా మారి...
బంగారం అంటే ఒకప్పుడు సెంటిమెంట్ గా చూసేవారు. కానీ పెరిగిన ధరలు చూసి బంగారం నేడు అపురూపమైన వస్తువుగా మారిపోయింది. ధరలు ఈ రేంజ్ లో పెరగడంతో బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడం ఇప్పుడు సామాన్యుల వల్ల కాదు. సామాన్యులే కాదు.. మధ్యతరగతి, ఉద్యోగ వర్గాలకు కూడా సాధ్యం కాదు. ఎందుకంటే బంగారం, వెండి ధరలు ఇంతలా పెరగడానికి అంతర్జాతీయ మార్కెట్ లో పెరుగుతున్న ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, ట్రంప్ విధించిన సుంకాలతో పాటు అనేక కారణాలతో బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని బిజినెస్ నిపుణులు చెబుతున్నారు.
బంగారాన్ని కొనుగోలు చేయడం...
బంగారం కొనుగోలు చేయడం ఇప్పుడు ఆషామాషీ కాదు. అలాగని మన సంస్కృతి సంప్రదాయాలను అనుసరించి బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేయకుండా ఉండలేరు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. ఈరోజు ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,01,890 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,11,160 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 1,42,900 రూపాయలకు చేరుకుంది.


Tags:    

Similar News