Gold Price Today : ధరలు తగ్గాయట.. గుడ్ న్యూస్.. అట.. ఎంత ధర తగ్గిందో తెలుసా?

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొంత తగ్గుదల కనిపించింది

Update: 2025-07-21 03:22 GMT

బంగారం కొనుగోలు చేయాలంటే ఇప్పుడు అందరికీ సాధ్యం కాదు. లక్ష రూపాయలకు చేరుకుంది. లక్ష రూపాయలు పెట్టి బంగారాన్ని కొనుగోలు చేయడం అవివేకం అవుతుంది. పోనీ ధరలు తగ్గవన్న గ్యారంటీ అయితే ఏమీ లేదు. అందుకే ఎవరూ బంగారాన్ని కొనుగోలు చేయాలంటే సాహసం చేయాలనే పరిస్థితికి వచ్చింది. బంగారం ధరలు అందుబాటులో ఉంటే సరే.. అసలు ధరలు చిటారుకొమ్మన కూర్చుని దిగిరానంటూ ఎలా కొనుగోలు చేస్తారన్న ప్రశ్నలకు ఎవరి వద్ద సమాధానం లేదు. పెట్టుబడిగా బంగారాన్ని చూసే వాళ్లు సయితం దీనిని కొనుగోలు చేయడానికి ఇబ్బందులు పడుతున్నారు. పెట్టుబడి పెట్టి నష్టపోతామేమోనన్న ఆందోళనలో ఉన్నారు.

ధరలు పెరగడమే తప్పించి...
బంగారం నిజంగా బంగారమే అయింది. ధరలు ఇంతగా పెరగడం గతంలో ఎన్నడూ చూడలేదు. ఈ ఏడాది మొత్తం ధరలు పెరుగుతూ బంగారం ప్రియులను షాక్ కు గురి చేస్తూనే ఉన్నాయి. సీజన్ తో సంబంధం లేకుండా ధరలు పెరుగుతుండటంతో బంగారం కొనుగోలు చేసే వారు వెనక్కు తగ్గుతున్నారు. మరొక నాలుగు రోజుల్లో శ్రావణ మాసం ప్రారంభం కానుంది. పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమయితే ఇక ధరలు అదుపులో ఉండటం కష్టమే. ఎందుకంటే పెళ్లిళ్లు, శుభకార్యాలకు దండిగా బంగారాన్ని కొనుగోలు చేసే అలవాటుతో పాటు సంప్రదాయాలు కూడా ఉండటంతో కొనుగోళ్లు ఎక్కువై మరో నాలుగు నెలల పాటు ధరలు తగ్గే అవకాశం లేదని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
స్వల్పంగా తగ్గినా...
ధరలు నియంత్రించడం ఎవరి చేతుల్లో ఉండదు. అనేక కారణాలతో బంగారం, వెండి ధరలు పెరుగుతాయి. బంగారం ధరలతో పోటీ పడి మరీ వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొంత తగ్గుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 91,960 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,00,030 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 1,25,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.
Tags:    

Similar News