Gold Price Today : గోల్డ్ లవర్స్ కు ఊరట.. ధరలు దిగివచ్చాయ్.. ఈరోజు ఎంతంటే?
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొద్దిగా తగ్గుదల కనిపించింది
పసిడి అంటే పడని వారు ఎవరు? అందరూ పసిడి కోసం పడి చచ్చిపోతారు. తమ వద్ద ఎంత బంగారం ఉంటే అంత జీవితానికి భద్రత అని భావిస్తారు. తమకు కష్టమైన సమయాల్లో బంగారం ఆదుకుంటుందని, తాము కొనుగోలు చేసిన బంగారం అవసరాలకు ఉపయోగపడుతుందని నమ్ముతారు. బ్యాంకుల్లో బంగారం కుదువ పెట్టినా వెంటనే రుణం పొంది తక్కువ వడ్డీకి తమ అవసరాలు తీర్చుకోవచ్చని భావించి ఎక్కువ మంది బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. కరోనా వంటి క్లిష్ట సమయంలో బంగారం కొన్ని లక్షల కుటుంబాలను ఆదుకుంది. ఉపాధి లేక కొన్ని నెలల పాటు ఇంట్లోనే ఉండాల్సి రావడంతో బంగారమే అప్పుడు తమకు ఇంత ఫుడ్డు పెట్టిందనే వారు అనేక మంది ఉన్నారు.
భద్రతగా భావించి...
అందుకే బంగారాన్ని కేవలం ఆభరణంగానే చూడరు. భద్రతగా చూస్తారు. మరొకవైపు సెంటిమెంట్ ఎటూ ఉండనే ఉంది. భారతీయ సంస్కృతిలో బంగారం భాగమయంది. పండగలు, పుట్టిన రోజులకు కూడా బంగారాన్ని కొనుగోలు చేసి తమ వద్ద దాచుకోవడం ప్రారంభించిన రోజులు నేడు గుర్తుకు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఇప్పుడు బంగారాన్ని కొనుగోలు చేయాలంటే అందరికీ సాధ్యం కాని విషయం. ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో బంగారం కంటే ఇతర వాటిపై పెట్టుబడులు పెట్టడం మంచిదన్న భావన ఎక్కువ మందిలో కలుగుతుంది. అదే సయమంలో పెట్టుబడి పెట్టేవారు సయితం పెరిగిన బంగారం ధరలు చూసి వెనక్కు తగ్గుతున్నారు.
కొద్దిగా తగ్గి...
బంగారం ధరలు పెరుగుతూనే ఉంటాయి. దానికి డిమాండ్ తో పని లేదు. సీజన్ తో సంబంధం లేదు. ప్రస్తుతం ఆషాఢమాసమయినా ధరల్లో పెద్దగా మార్పు కనిపించడం లేదు. కొద్దిగా తగ్గినా ఇంకా అందుబాటులోకి రాలేదు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొద్దిగా తగ్గుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ ఉదయం ఆరు గంటలకు నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 90,590 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 98,820 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 1,19,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.