Gold Price Today : ఊరటనిచ్చిన బంగారం.. షాకిచ్చిన వెండి.. ధరలు నేడు ఎలా ఉన్నాయంటే?
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండిధరలు స్వల్పంగా పెరిగాయి.
బంగారం ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కొనుగోలుదారులకు చుక్కలు చూపుతున్నాయి. బంగారాన్ని కొనుగోలు చేయాలంటే గగనమయి పోతుంది. వెండి ధరలు కూడా అలాగే పరుగులు తీస్తున్నాయి. అనేక కారణాలతో బంగారం, వెండి ధరల్లో హెచ్చు తగ్గులు ప్రతి రోజూ ఉంటాయి. అంతర్జాతీయ ధరల్లో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, యుద్ధాలు, ట్రంప్ నిర్ణయాలు వంటి కారణాలతో బంగారం ధరలు ఇటీవల కాలంలో విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది జనవరి నెల నుంచి పరుగును ప్రారంభించిన బంగారం ఇక ఆగకుండా పరుగెడుతూనే ఉంది. మధ్యలో కొద్దిగా తగ్గినా అనుకున్న స్థాయిలో తగ్గడం లేదు.
ధరలు అందుబాటులో లేక...
బంగారం కొనుగోలు చేయాలంటే అనువైన, అందుబాటులో ధరలు ఉంటేనే కొనుగోలు చేస్తారు. తమ ఆర్థిక స్థోమతను మించి ఎవరూ కొనుగోలు చేయడానికి సిద్దపడరు. బంగారం ఒకప్పుడు కొనుగోలు చేయాలంటే ఆసక్తి ఉండేది. బంగారం తమ చెంత ఉంటే భవిష్యత్ బాగుంటుందని, కష్టకాలంలో ఆదుకుంటుందని నమ్మి ఎక్కువ మంది దానిని కొనుగోలు చేసేవారు. దీంతో పాటు సంస్కృతి సంప్రదాయాలు కూడా బంగారం కొనుగోలు వైపు చూసేలా చేస్తాయి. ఇక పుట్టినరోజు నుంచి పెళ్లిళ్ల వరకూ బంగారం, వెండి వస్తువులు లేనిదే జరగని పరిస్థితి. కానీ నేడు ధరలు పెరిగిన నేపథ్యంలో అలాంటి ఆలోచనలకు దాదాపు 80 శాతం మంది ప్రజలు విరమించుకున్నారు.
పెట్టుబడి పెట్టేవారు...
ఇక బంగారంపై పెట్టుబడి పెట్టేవారు కూడా ఈ ఏడాది మొదటి వరకూ అధికంగా ఉన్నారు. కానీ పెరుగుతున్న బంగారం ధరలు చూసి మళ్లీ అదే స్థాయిలో ధరలు తగ్గుతాయని భావించి పెట్టుబడి పెట్టేందుకు కూడా జంకుతున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండిధరలు స్వల్పంగా పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఉదయం ఆరు గంటలకు నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 89,540 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 97,680 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. కిలో వెండి ధర 1,08,100 రూపాయలుగా కొనసాగుతుంది.