Gold Price Today : పసిడి ప్రియులకు తీపి కబురు.. బంగారం ఇక కొనేయొచ్చండోయ్

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొంత తగ్గుదల కనిపించింది.

Update: 2025-05-15 03:25 GMT

బంగారం ధరలు మరింత పెరుగుతాయన్న హెచ్చరికలు వినియోగదారులను మరింత షాక్ కు గురి చేస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ధరలు పెరుగుతూనే ఉన్నాయి. మధ్యలో కొన్ని రోజుల పాటు బంగారం, వెండి ధరలు భారీగా తగ్గి ఊరించాయి. అయితే అనుకున్న స్థాయిలో ధరలు తగ్గకపోవడంతో ఇంకా అమ్మకాలు ఊపందుకోలేదు. బంగారాన్ని కొనుగోలు చేయడం ఒకప్పటిలా తేలిక కాదు. ఇప్పుడు బంగారం, వెండిని సొంతం చేసుకోవాలంటే లక్షల రూపాయలు అవసరమవుతాయి. అంత సొమ్ము వెచ్చించలేని వారు కొనుగోళ్లకు దూరంగా ఉంటున్నారు. పది గ్రాముల బంగారం లక్ష రూపాయలకు చేరుకుని తిరిగి స్వల్పంగా తగ్గుతూ క్రమంగా దిగుతుంది.

సీజన్ లో డిమాండ్...
పెళ్లిళ్ల సీజన్ లో బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరుగుతాయి. ఎందుకంటే భారతదేశంలో వివాహాది వేడుకలతో పాటు శుభకార్యాలకు ఖచ్చితంగా బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. ముఖ్యంగా పెళ్లిళ్లకు అయితే వధువుతో పాటు వరుడికి సంబంధించిన ఆభరణాలను తమ స్థాయికి తగినట్లుగా బంగారాన్ని కొనుగోలు చేస్తారు. పేద, మధ్యతరగతి ప్రజలు కూడా ఇది సంప్రదాయంగా పాటిస్తుండటంతో సీజన్ లో బంగారం, వెండి ఆభరణాలకు ఎక్కువ డిమాండ్ ఏర్పడుతుంది. అప్పుడు ధరలు పెరుగుతాయి. కానీ ఈ ఏడాది ఆరంభం నుంచి బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉండటంతో పాటు, ధరలు అందుబాటులో లేకపోవడంతో కొనుగోళ్లు పెద్దగా జరగలేదు.
స్వల్పంగా తగ్గి...
భారతీయులకు బంగారం అంటే ఎక్కువ మక్కువ. ముఖ్యంగా మహిళలు అత్యంత ఇష్టంగా కొనుగోలు చేస్తుంటారు. అయితే మరికొద్దిగా ధరలు తగ్గి తమకు అందుబాటులోకి వస్తే కొనుగోలు చేయాలని ఎదురు చూస్తున్నారు. అప్పటి వరకూ ధరలు ఎంత తగ్గినా బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రారు అని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొంత తగ్గుదల కనిపించింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఉదయం ఆరు గంటలకు నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 88,040 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 96,050 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 97,800 రూపాయలకు దిగి వచ్చింది.


Tags:    

Similar News