Gold Price Today : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్... భారీగా తగ్గిన బంగారం ధరలు.. ఎంతంటే?
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా స్వల్ప తగ్గుదల కనిపించింది.
బంగారం ధరలు క్రమంగా దిగి వస్తున్నాయి. నిన్న మొన్నటి వరకూ భారీగా పెరిగిన బంగారం ధరలు అనేక కారణాలతో తిరిగి యధాతథ స్థితికి చేరే అవకాశాలున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. బంగారం ధరలు భారీగా పెరిగి పోవడంతో సేల్స్ పడిపోయాయి. అమ్మకాలు తగ్గిపోవడంతో వ్యాపారాలు కూడా వెలవెల బోయాయి. పెళ్లిళ్ల సీజన్ లోనూ బంగారం కొనుగోళ్లు సక్రమంగా లేకపోవడతో వ్యాపారులు భారీ ఆఫర్లను ప్రకటించారు. అయినా సరే అమ్మకాలు ఊపందుకోలేదు. మరొక వైపు సీజన్ పూర్తి కావడం, ఆషాఢం మాసం రావడంతో బంగారం ధరలు దిగి రాక తప్పదని మార్కెట్ నిపుణుల అంచనాగా వినిపిస్తుంది. అయితే ఇంకా ధరలు దిగి వస్తేనే బంగారం కొనుగోళ్లు పెరుగుతాయని వ్యాపారులు చెబుతున్నారు.
అప్పుడే కొనుగోళ్లు...
ఇరాన్ - ఇజ్రాయిల్ మధ్య యుద్ధం ఆగిపోవడంతో బంగారం ధరలు కొంత వరకూ దిగివస్తున్నాయని బిజినెస్ నిపుణులు చెబుతున్నారు. బంగారం, వెండి ధరలు ఈ ఏడాది ఎంత పెరిగాయంటే గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగాయి. బంగారం కొనుగోలు చేయాలంటే సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ధరలు అందుబాటులో ఉండాలి. అప్పుడే కొనుగోలు చేస్తారు. కానీ వారు విముఖత చూపితే సేల్స్ ఆటోమేటిక్ గా పడిపోతాయని వ్యాపారులు చెబుతున్నారు. అయితే బంగారం ధరలు పెరగడం, తగ్గడం అనేది ఎవరి చేతుల్లోనూ ఉండదని అనేక కారణాలతో వాటి ధరలు పెరుగుతూ ఉంటాయని, అందుకు ఎవరినీ తప్పు పట్టలేమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
భారీగా తగ్గి...
బంగారం అంటే అందరూ ఇష్టపడతారు. ముఖ్యంగా మహిళలు ఇష్టపడి కొనుగోలు చేసే బంగారం ధరలు అందుబాటులో ఉంటే అప్పో సొప్పో చేసి కొనుగోలు చేస్తారు. కానీ ధరలు వీరికి చేరువగా లేకపోవడంతో వెనక్కు తగ్గారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా స్వల్ప తగ్గుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై 930 రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయల మాత్రమే తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 89,840 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 98,010 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 1,17,800 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.