Gold Price Today : తీపికబురు.. శ్రావణమాసం రాకముందే బంగారం అందుబాటులోకి వస్తుందా?
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి
బంగారం ధరలు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి. తగ్గడం అనేది చాలా తక్కువ సార్లు జరుగుతుంటుంది. అనేక పరిణామాల నేపథ్యంలో ధరల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. ఎప్పుడు తగ్గినా పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు మాత్రమే తగ్గుతుంది. ఆషాఢమాసంలోనే బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఇక శ్రావణ మాసంలో బంగారం ఇంకెంత పెరుగుతుందన్న ఆందోళన అందరిలోనూ కనిపిస్తుంది. అదే సమయంలో వెండి ధరలు కూడా భారీగానే పెరుగుతున్నాయి. సెంటిమెంట్ గా భావించే బంగారం, వెండి వస్తువులు దూరమయిపోతున్నాయన్న బాధ అందరినీ కలచి వేస్తుంది. ముఖ్యంగా మహిళలు బంగారం కొనాలంటే ధరలను చూసి వెనకడుగు వేస్తున్నారు.
అదనపు వసూళ్లతో...
ఇప్పటికే పది గ్రాముల బంగారం ధర లక్ష రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర లక్షా ఇరవై వేలకు పైనే ఉంది. దీనికి తోడు కొనాలని వెళ్లిన వారికి తరుగు ఛార్జీలు, జీఎస్టీ, స్టేట్ ట్యాక్స్ అంటూ అదనంగా వసూలు చేస్తుండటంతో బంగారం ధర ఇప్పుడే లక్ష రూపాయలు దాటేస్తుందని వినియోగదారులు చెబుతున్నారు. గ్రాము బంగారం కొనుగోలు చేయాలన్నా భారంగా మారింది. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదని, ఈ నెల 25వ తేదీ నుంచి పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుండటంతో బంగారం, వెండి వస్తువులను ఎలా కొనుగోలు చేయాలన్న ఆందోళనలో ఉన్నారు. శ్రావణ మాసంలో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశముందని మార్కెట్ నిపుణులు హెచ్చరికలు మరింత భయాందోళనలకు గురి చేస్తున్నాయి.
భారీగా తగ్గి...
బంగారం అంటే నిజంగానే నేడు స్టేటస్ సింబల్ గా మారిపోయింది. స్థోమత ఉన్నవారు మాత్రమే కొనుగోలు చేసే పరిస్థితికి వచ్చింది. సాధారణ, మధ్యతరగతి ప్రజలు బంగారానికి ఏడాది నుంచి దూరమయ్యారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధర పై ఐదు వందల రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 90,990 రూపాయలకు చేరింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 99,270 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 1,23,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. అయితే మధ్యాహ్నానికి ఈ ధరల్లో మార్పులు ఉండవచ్చు. పెరగవచ్చు. తగ్గవచ్చు. స్థిరంగా కొనసాగవచ్చు.