Gold Price Today : గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. ఎంతంటే?
దేశంలో ఈరోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి
బంగారం ధరలు మరింత పెరుగుతాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే ధరలు పెరగడంతో గోల్డ్ కొనుగోలు చేసే వారు కూడా కరువయ్యారు. బంగారం, వెండి ధరలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ధరలు పెరుగుతున్నాయి. ఇలా ధరలు పెరగడం గతంలో మునుపెన్నడూ చూడలేదని, ఏడాదికి కొంత మేర ధరలు పెరగడం వాస్తవమే కాని, సీజన్ తో సంబంధం లేకుండా ధరలు పెరుగుతుండటంతో వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది. అసలు కొనుగోలు చేయడానికి బంగారం ధరలు అందుబాటులో లేకపోవడంతో వాటిని సొంతం చేసుకోలేక, పెరుగుతున్న ధరలు తమకు అందుబాటులో లేవని అనేక మంది చెబుతున్నారు.
ఆషాఢమాసంలోనూ....
ప్రస్తుతం ఆషాఢమాసం నడుస్తుంది. ఇక శ్రావణమాసంలో ధరలు మరింత పెరుగుతాయి. శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి మహిళలు పూజలు చేస్తారు. ఎక్కువగా బంగారాన్ని కొనుగోలు చేయడం అలవాటు. సంప్రదాయంగా వస్తుంది. అయితే ఈ ధరలతో శ్రావణ మాసంలోనూ కొనుగోళ్లు పెద్దగా ఉండవన్న అభిప్రాయం వ్యాపారుల్లో వ్యక్తమవుతుంది. అదే సమయంలో ఆషాఢమాసంలోనే ధరలు ఇలా పెరుగుతుంటే ఇక శ్రావణ మాసంలో ధరలు మరింత పెరుగుతాయన్న అంచనాలు వినపడుతున్న నేపథ్యంలో బంగారం ధరలు లక్ష రూపాయలు దాటే అవకాశాలున్నాయి. ఇప్పటికే రెండుసార్లు లక్ష రూపాయలు టచ్ చేసి వచ్చిన బంగారం ధరలు మరింత పెరిగే అవకాశముంది.
భారీగా తగ్గి...
బంగారం అంటేనే మోజు. అదొక సెంటిమెంట్. అదే సమయంలో సంస్కృతి సంప్రదాయాల్లో భాగం. అదే సమయంలో బంగారం ఉంటే భద్రత ఉంటుందన్న నమ్మకంతో ఎక్కువ మంది బంగారాన్ని కొనుగోలు చేస్తారు. భవిష్యత్ లో ఎదురయ్యే కష్టాలకు బంగారం చెక్ పెడుతుందని నమ్మి కొనుగోలు చేస్తారు. దేశంలో ఈరోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. పది గ్రాముల బంగారం ధరపై ఆరు వందల రూపాయల వరకూ తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఉదయం ఆరు గంటలకు బంగారం, వెండి ధరలు నమోదయిన వాటి ప్రకారం ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 90,100 రూపాయలకు చేరింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 98,280 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 1,19,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది