Gold Price Today : పసిడిప్రియులకు గుడ్ న్యూస్.. ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?
ఈరోజు దేశంలో బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
పసిడి ప్రియులకు ప్రతి రోజూ టెన్షన్ తప్పేలా కనిపించడం లేదు. ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. వెండి ధరలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. దీంతో బంగారం, వెండి వస్తువులు అందని ఆకర్షణీయమైన వస్తువులుగానే భవిష్యత్ లో మిగిలిపోతాయేమోనన్న ఆందోళన అందిలోనూ వ్యక్తమవుతుంది. బంగారం పది గ్రాముల ధర లక్ష రూపాయలకు చేరువలో ఉండగా, వెండి ధరలు మాత్రం లక్ష రూపాయలను ఎప్పుడో దాటేశాయి. ఈ నేపథ్యంలో పండగలు, పబ్బాలకు బంగారం, వెండిని కొనుగోలు చేయాలంటే సాధ్యం అయ్యే పనికాదని అధిక శాతం మంది వినియోగదారులు ఫిక్స్ అయినట్లే కనపడుతుంది.
ప్రతి రోజూ పెరుగుతూ...
బంగారం ధరలు గతంలో తగ్గుతూ, పెరుగుతూ ఉండేవి. కానీ గతంలో ఎన్నడూ ఇంత భారీ స్థాయిలో ధరలు మాత్రం పెరగలేదు. కానీ ఈ ఏడాది ప్రారంభం నుంచే ధరలు మామూలుగా పెరగడం లేదు. పెరిగిన ధరలు చూసి వ్యాపారులే అవాక్కవుతున్నారు. బంగారం, వెండి ధరలు ఎప్పుడూ స్థిరంగా ఉండవు. ప్రతి రోజూ ధరల్లో మార్పులు, చేర్పులు ఉంటాయి. అయితే ఇందుకు చెబుతున్న కారణాలు అనేకం ఉన్నప్పటికీ సామాన్య ప్రజలకు ధరలు అందుబాటులో ఉంటేనే కొనుగోళ్లు ఎక్కువగా ఉంటాయి. ధరలు అదుపులో లేకపోతే మాత్రం ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా బంగారం, వెండి మాత్రమే కాదు.. ఏ వస్తువు పైనేనా చూపుతుంది. అంత ధరను పోసి కొనుగోలు చేయడం పట్ల ఆలోచన మొదలవుతుంది.
స్టేబుల్ కాగానే..
పెళ్లిళ్ల సీజన్ కూడా కంప్లీట్ అవ్వడం, శుభముహూర్తాలు కూడా ముగియనుండటంతో ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. సాధారణంగా సీజన్ లో ధరలు పెరగాలి. అలాంటిది సీజన్ కాకపోయినా ధరలు పెరగడంపై వినియోగదారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. మధ్యాహ్నానికి ధరలు పెరగొచ్చు. తగ్గొచ్చు. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఉదయం ఆరు గంటలకు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 89,800 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 97,970 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 1,07,000 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది.