Gold Rates : ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర.. తులం ఎంతంటే?

బంగారం ధరలు ఈరోజు భారీగా పెరిగాయి. లక్షకు చేరువలో పది గ్రాముల బంగారం ధర చేరుకునే పరిస్థితి వచ్చింది

Update: 2025-04-16 12:43 GMT

బంగారం ధరలు ఈరోజు భారీగా పెరిగాయి. లక్షకు చేరువలో పది గ్రాముల బంగారం ధర చేరుకునే పరిస్థితి వచ్చింది. ఈ ఒక్కరోజు 1,650 రూపాయలు పెరిగింది. దీంతో బంగారం ధరలు దేశంలో ఆల్ టైం హైకి చేరుకున్నాయి. ఈ నెలాఖరుకు లక్షకు చేరుకుంటుందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ఒక్కసారిగా ఇంత భారీ స్థాయిలో ధరలు పెరగడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 98,100 రూపాయలకు చేరుకుంది.

పెళ్లిళ్ల సీజన్ కావడంతో...
మహిళలు పెళ్లిళ్ల సీజన్ కావడంతో పాటు అక్షర తృతీయ కూడా వస్తుండటంతో ఒక్కసారిగా డిమాండ్ పెరిగిందని, విదేశాల నుంచి బంగారం నిల్వలు రాకపోవడంతో ధరలు పెరిగాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది పది గ్రాముల బంగారం ధర లక్షా పాతిక వేల రూపాయలకు చేరుకుంటుందని అంచనాలు వినపడుతున్నాయి.


Tags:    

Similar News