Gold Price Today : షాకిచ్చిన బంగారం ధరలు .. ఎంత పెరిగాయో తెలిస్తే?

ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి

Update: 2025-05-22 03:58 GMT

దేశంలో బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో? తగ్గుతాయో చెప్పలేం. ఎందుకంటే ధరల పెరుగుదల ఎవరి చేతుల్లోనూ ఉండదు. డిమాండ్ ను బట్టి అనేక కారణాలతో ధరలు పెరుగుతూనే ఉంటాయి. గత కొద్ది రోజులుగా బంగారం, వెండి ధరలు అదుపులో లేకపోవడంతో వినియోగదారులు కూడా బంగారం దుకాణాల వైపు చూడటం లేదు. ఇటీవల కొంత తగ్గినట్లు కనిపించినప్పటికీ భారీగా పెరిగి షాకుల మీద షాకులు ఇస్తున్నాయి. వినియోగదారులు కొనుగోలు చేయాలన్నా అందనంత దూరంలో ధరలు ఉంటున్నాయి. ధరలు దిగ వస్తాయేమోనని అనేక మంది ఎదురు చూస్తున్నా ఎప్పటికప్పుడు ధరలు పెరుగుతుండటంతో పెట్టుబడి పెట్టే వారు కూడా కొనుగోలు చేయడం లేదని వ్యాపారులు చెబుతున్నారు.

సీజన్ లేకపోయినా...
దక్షిణ భారత దేశంలో బంగారం కొనుగోళ్లకు ప్రస్తుతం ఒక సీజన్ అంటూ లేకుండా పోయింది. గతంలో పెళ్లిళ్లు, శుభకార్యాలకు మాత్రమే బంగారం, వెండి వంటి వస్తువులను కొనుగోలు చేసేవారు. కానీ ఇప్పుడు ఎప్పుడు డబ్బులుంటే అప్పుడు కొనుగోలు చేయడం అలవాటుగా మార్చుకున్నారు. కష్టకాలంలో బంగారం తమకు అండగా ఉంటుందని, భరోసాగా నిలుస్తుందని భావించి కొనుగోలు చేసేవారు. సురక్షితమైన పెట్టుబడిగా భావించి బంగారంపై పెట్టుబడి పెట్టేవారు. కానీ పెరుగుతున్న ధరలతో ఇప్పుడు బంగారం ముట్టుకుంటేనే షాక్ అవుతుంది. ధరలు అంత భారీగా పెరగడం ఇటీవల కాలంలో ఎన్నడూ చూడలేని చెబుతూ వాటికి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నారు.
ధరలు భారీగా పెరిగి...
పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్నప్పటికీ ఆశించినంత రీతిలో వ్యాపారాలు జరగడం లేదని, గతంతో పోలిస్తే బంగారం, వెండి అమ్మకాలు అరవై శాతం వరకూ పడిపోయాయని వ్యాపారులు చెబుతున్నారు. ధరలు పెరిగితే తాము ఎలా కొనుగోలు చేస్తామని ప్రశ్నిస్తున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై 1900 రూపాయలు పెరిగింది. వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. కిలో వెండి ధర 2,100 రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఉదయం ఆరు గంటలకు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 89,130 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 97,580 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 1,11,100 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.


Tags:    

Similar News