Gold Price Today : బంగారం కొనుగోలుదారులకు షాకిచ్చిన ధరలు.. ఎంత ఉన్నాయంటే?
ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు స్వ్పలంగా పెరిగాయి
బంగారం ధరలు పైకి చూస్తుంటాయి. గత కొద్ది రోజులుగా పతనం దిశగా పయనిస్తున్న బంగారం ధరలు మళ్లీ పరుగును ప్రారంభించాయి. ధరలు పెరుగుదల ఎవరి చేతుల్లోనూ ఉండదు. ఒక్కసారిగా ధరలు పెరుగుతుంటాయి. కొనుగోలు చేద్దామని అనుకునే లోపు ధరలను చూసి షాక్ తినాల్సి వస్తుంది. అందుకే బంగారం విషయంలో ఎప్పటికప్పడు నిర్ణయం తీసుకోవాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఇవి నిలకడగా ఉండవు. నిత్యం ధరల్లో మార్పులు, చేర్పులు ఉంటాయి. ధరలు కొంత తగ్గినప్పుడే కొనుగోలు చేయడం మంచిదని, ఇంకా ధరలు తగ్గుతాయని భావించి ఎదురు చూపులు చూస్తే చివరకు ఆశాభంగమే మిగులుతుందని వ్యాపారులు సయితం చెబుతున్నారు.
ఈ ఏడాది బ్యాడ్ లక్...
బంగారం ధరలు పెరగడానికి అనేక కారణాలున్నా ఎందుకో 2025 సంవత్సరం బంగారం ప్రియులకు చేదు మిగిల్చింది. వారి ఆశలపై నీళ్లు చల్లింది. ఏడాది ప్రారంభం నుంచి బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. మధ్యలో కొంత తగ్గినా అది స్వల్పంగా మాత్రమే. అందుకే బంగారం ధరల పెరుగుతున్నాయని బాధపడకూడదు. తగ్గాయని సంతోష పడకూడదు. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, యుద్ధాలు ఆగిపోవడం వంటి కారణాలతో ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇదే సమయంలో ధరలు మరింత పెరిగే అవకాశముందని చెబుతున్నారు.
మళ్లీ పెరిగి...
శ్రావణమాసం వస్తుండటంతో బంగరారం కొనుగోళ్లు పెరుగుతాయి. ఈ మాసంలో మహిళలు ఎక్కువగా బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. అందుకే ఈ నెలలో మళ్లీ ధరలు పెరిగే అవకాశముందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు స్వ్పలంగా పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 90,210 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 98,410 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 1,20,100 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది.