Gold Rates Today : గుడ్ న్యూస్ ఆరువేలు తగ్గిన బంగారం ధర

బంగారం ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఆరువేల రూపాయలు తగ్గింది

Update: 2025-10-22 05:47 GMT

బంగారం ధరలు భారీగా తగ్గాయి. గతంలో ఎన్నడూ తగ్గనంతగా ధరలు తగ్గాయి. ఇటీవల కాలంలో భారీగా పెరిగిన బంగారం ధరలు గత కొద్ది రోజుల నుంచి స్వల్పంగా తగ్గుతున్నాయి. అయితే ఈరోజు మాత్రం బంగారం ధరలు భారీగా తగ్గడంతో వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పది గ్రాముల బంగారం ధరపై ఆరు వేల రూపాయలు తగ్గింది. అమెరికా డాలర్ బలోపేతం కావడంతో పాటు అంతర్జాతీయంగా యుద్ధాలు కొంత సమసి పోవడంతో ధరలు దిగివచ్చాయని మార్కెట్ నిపుణలు చెబుతున్నారు.

నేడు మార్కెట్ లో ధరలు...
ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,17,500 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,28,150 రూపాయలుగా నమోదయింది. ఇంత భారీగా తగ్గడం ఇటీవల కాలంలో ఇదే మొదటి సారి వ్యాపారులు చెబుతున్నారు. బంగారం కొనుగోలు చేసే వారికి ఇదే మంచి సమయమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.


Tags:    

Similar News