Gold Rates Today : ఈరోజు బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. ధరలు కొంత తగ్గాయ్?
ఈరోజు కూడా బంగారం ధరలు స్వల్పంగా తగ్గింది. వెండి ధరలు కొంత మేరకు తగ్గాయి.
బంగారం ధరలు పైపైకి ఎగబాగుతున్నాయి. వెండి ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. గత కొద్ది రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ధరలు అధికంగా పెరగడంతో వినియోగదారులు బంగారానికి దూరం అవుతున్నారు. ఏడాది కాలంలో బంగారం ధరలు యాభై మూడు శాతం పెరిగిందని జ్యుయలరీ దుకాణాల యాజమాన్యం చెబుతుంది. బంగారం ధరలు అమాంతం పెరగడానికి అనేక కారణాలు కనిపిస్తున్నప్పటికీ ఇంత భారీ ధరలను పెట్టి కొనుగోలు చేసేందుకు కొనుగోలుదారులు ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో గత కొన్నాళ్ల నుంచి బంగారం దుకాణాల యజమానులు బేరాలు లేక బాధపడిపోతున్నారు.తెచ్చిన బంగారం నిల్వలన్నీ అలాగే మిగిలిపోయాయయని అంటున్నారు.
గత కొన్ని రోజులుగా...
బంగారం ధరలకు పెరగడమే తప్ప తగ్గడం తెలియని పరిస్థితి ఉంది. గతంలో కొద్దిగా బంగారం అందుబాటులో ఉండేది. కానీ ఇప్పుడు అందుబాటులో కాదు కదా కనీసం చేరువలో కూడా లేదు. కొనుగోలు చేసే పరిస్థితి కూడా కనిపించడం లేదు. బంగారం ఇంత భారీ స్థాయిలో పెరుగుదలకు కారణం అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యంతో పాటు బంగారం దిగుమతులు క్షీణించడం, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన అదనపు సుంకాలతో బంగారం ధరలు మరింత పెరిగాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇలాగే పెరిగితే ఈ నెలాఖరుకు బంగారం ధర లక్షన్నరకు చేరుకుంటుందన్న అంచనాలు కూడా వినిపిస్తున్నాయి.
సీజన్ అయినా...
పెళ్లిళ్ల సీజన్ అయినప్పటికీ, పండగలు ముందు ఉన్నప్పటికీ బంగారం అమ్మకాలు మాత్రం జరగడం లేదు. థన్ తెరాస్ తో పాటు దసరా, దీపావళి వంటి పండగలు కూడా ఉన్నప్పటికీ పెరిగిన ధరలతో బంగారాన్ని కొనుగోలు చేయడానికి బహుశ ఎవరూ ముందుకు వచ్చే అవకాశం కనిపించడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. ఈరోజు కూడా బంగారం ధరలు స్వల్పంగా తగ్గింది. వెండి ధరలు కొంత మేరకు తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,01,290 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,10,499 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 1,39,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి ధరల్లో మార్పులు కనిపించవచ్చు.