గుడ్ న్యూస్ తగ్గనున్న కార్ల ధరలు... ఎంత తగ్గనున్నాయంటే?
కార్ల ధరలు భారీగా తగ్గనున్నాయి. జీఎస్టీ శ్లాబుల మార్పులతో చిన్నకార్ల ధరలు భారీగా తగ్గనున్నాయి
కార్ల ధరలు భారీగా తగ్గనున్నాయి. జీఎస్టీ శ్లాబుల మార్పులతో చిన్నకార్ల ధరలు భారీగా తగ్గనున్నాయి. కొన్ని కార్లకు డిమాండ్ గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో నాలుగు మీటర్ల కంటే తక్కువ పొడవున్న కార్లపై పన్ను భారం 10శాతం తగ్గనుంది. వీటితోపాటు రోజువారీ వాడుకొనే చిన్న బైకులకు కూడా జీఎస్టీ తగ్గింపుతో రిలీఫ్ లభించనుంది.
ఈ నెల నుంచి...
సెప్టంబరు 22వ తేదీ నుంచి జీఎస్టీ శ్లాబుల మార్పులు అమలులోకి రానున్నాయి. అప్పటి నుంచి కార్ల ధరలు తగ్గే అవకాశముంది. ప్రధానంగా నగరాల్లో చిన్న కార్లకు మంచి డిమాండ్ ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు. అధికంగా కార్లను విక్రయిస్తే వివిధ రూపాల్లో రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశముందన్న అంచనాలు వినిపిస్తున్నాయి.