New Pulsar: మార్కెట్లోకి నయా పల్సర్ బైక్.. అదిరిపోయే ఫీచర్స్
మార్కెట్లో కొత్త కొత్త బైక్‌లు విడుదలవుతున్నాయి. బైక్ ప్రియులను ఆకర్షించే విధంగా కొత్త కొత్త ఫీచర్స్‌ను జోడిస్తూ భారత..
New Pulsar
New Pulsar:మార్కెట్లో కొత్త కొత్త బైక్‌లు విడుదలవుతున్నాయి. బైక్ ప్రియులను ఆకర్షించే విధంగా కొత్త కొత్త ఫీచర్స్‌ను జోడిస్తూ భారత మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. ఇక ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ బజాజ్ ఆటో..దేశీయ మార్కెట్లోకి సరికొత్త పల్సర్ బైక్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. 2024 ఎడిషన్‌గా విడుదల చేసిన ఈ పల్సర్ ఎన్‌ఎస్ సిరీస్ బైకులను మార్కెట్లోకి తీసుకువచ్చింది. పల్సర్ ఎన్‌ఎస్ 2024 సిరీస్, ఎన్‌ఎస్200, ఎన్‌ఎస్160, ఎన్‌ఎస్ 125 మూడు మోడళ్లలో లభించనున్నాయి. అయితే వీటి ధరలను పరిశీలిస్తే వరుసగా రూ.1,57,427, రూ.1,45,792, రూ.1,04,922 ధరను నిర్ణయించింది కంపెనీ.
డిజిటల్ కన్సోలెస్
ఇదిలా ఉండగా, ఈ బైక్‌లలో అత్యాధునిక ఫీచర్స్‌ను జోడించింది కంపెనీ. కొత్త డిజిటల్ కన్సోలెస్ అండ్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌తో అందుబాటులోకి తీసుకువచ్చింది. పాత మాడల్‌తో పోలిస్తే ఈ కొత్త మాడల్‌ను సెమీ-డిజిటల్, బ్లూటూత్ కనెక్టివిటీ, ఇన్‌కమింగ్ కాల్స్, ఎస్‌ఎంఎస్ అలర్ట్, ఫోన్ బ్యాటరీ సామర్థ్యం, సిగ్నల్ లెవల్, నావిగేషన్ కూడా తెలుసుకునే సదుపాయం ఉంది. 150 సీసీ సామర్థ్యంతో రూపొందించిన ఈ బైకుల విక్రయాల్లో ఈ బైకు అత్యధికంగా నమోదవుతుంది. ఇందులో ఉండే ఫీచర్స్ బైక్ ప్రియులకు ఎంతగానో నచ్చుతుందని కంపెనీ చెబుతోంది.