ఇది గోల్డ్ టైం.. కొనేసేయండి

ఈరోజు బంగారంధరలు పెరగలేదు. నిలకడగా కొనసాగుతున్నాయి. వెండి ధర మాత్రం భారీగా పెరిగింది

Update: 2023-09-13 03:06 GMT

ప్రపంచ దేశాల్లోనూ బంగారానికి డిమాండ్ ఉంది. అయితే అక్కడ గోల్డ్ బాండ్స్ కొనుగోలు చేస్తారు. అవసరమైనప్పుడు విక్రయించుకునేందుకు వీలుగా గోల్డ్ బాండ్స్ ఉంటాయని ఇతర దేశాల్లో ఈ రకంగా గోల్డ్ కొనుగోళ్లు జరుగుతుంటాయి. కానీ భారత్ లో అలా కాదు.. అదీ దక్షిణ భారత దేశంలో ఎక్కువగా ఆభరణాల కొనుగోలుకే ప్రాధాన్యత ఇస్తారు. స్టేటస్ సింబల్ గా భావించడంతో పాటు మేలిమి బంగారం తమ వద్ద ఉంటే మంచిదన్న విశ్వాసం దక్షిణ భారతీయుల్లో ఎక్కువగా కనిపిస్తుంది.

దక్షిణ భారత్ లోనే...
అందుకే దక్షిణ భారత దేశంలో ఎక్కువ జ్యుయలరీ షాపులుంటాయి. ఎప్పుడూ దుకాణాలు వినియోగదారులతో కిటకిటలాడుతుంటాయి. గతంలో సీజన్ లో నే కొనుగోలు చేసిన వారు ఇప్పుడు సీజన్ తో సంబంధం లేకుండా ఎప్పుడు డబ్బులుంటే అప్పుడు కొనుగోలు చేస్తుండటంతో ఆభరణాల విక్రయాలు ఊపందుకున్నాయి. అందుకే గల్లీ గల్లీకి ఒక జ్యుయలరీ షాపు ఒక దక్షిణ భారతదేశంలోనే కనిపిస్తుంది. మగువలు ఇష్టపడే బంగారాన్ని వివిధ రూపాల్లో కొత్తకొత్త డిజైన్లతో అందిస్తుండటంతో డిమాండ్ కూడా అధికంగానే ఉంటుంది.
వెండి మాత్రం...
అయితే ఈరోజు బంగారం కొనుగోలు చేసే వారికి గుడ్ న్యూస్ అని చెప్పాలి. బంగారం ధరలు పెరగలేదు. నిలకడగా కొనసాగుతున్నాయి. వెండి ధర మాత్రం భారీగా పెరిగింది. కిలో వెండి ధరపై ఐదు వందల రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 54,840 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 59,830 రూపాయలు పలుకుతుంది. ఇక కిలో వెండి ధర మాత్రం 78,000 రూపాయలకు చేరుకుంది.


Tags:    

Similar News