మళ్లీ పరుగులు

ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల పై కేవలం పది రూపాయలు మాత్రమే పెరిగింది.. వెండి భారీగా పెరిగింది

Update: 2023-09-12 04:03 GMT

పసిడి అంటే మక్కువ చూపని మహిళ ఎవరూ ఉండరు. బంగారం అంటే పిచ్చి. బంగారం కొనుగోలు చేయడానికి ప్రతి మహిళ ఉత్సాహపడుతుంది. ధరలతో సంబంధం లేకుండా బంగారాన్ని సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. అయితే బంగారం ధరలు పెరుగుతుండటం కొంత ఇబ్బంది కలిగిస్తున్నప్పటికీ డబ్బులు పోగు చేసి మరీ కొనుగోలు చేయడానికి కృషి చేస్తారు. బంగారాన్ని స్టేటస్ సింబల్ గా చూడటమే కాకుండా అది అవసరాలకు ఉపయోగపడే వస్తువుగా మారడంతో పసిడికి వాల్యూ పెరిగింది.

ధరలు పెరిగినా...
పసిడి గత కొద్ది రోజుల నుంచి పరుగులు పెడుతుంది. పేదలకు, సామాన్యులకు భారంగా మారింది. బంగారం కొందరి వస్తువుగానే మారుతుంది. అందునా పెళ్లిళ్ల సీజన్ కావడంతో ధరలు మరింత పరుగులు పెడుతున్నాయి. అయినా సరే కొనుగోళ్లు మాత్రం తగ్గడం లేదు. బంగారం ధరలను చూసి కొనుగోళ్లు ఆగవని, సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం దానిని కొనుగోలు చేయడానికి ముందుకు రావడం వల్లనే జ్యుయలరీ దుకాణాలు నిత్యం కళకళలాడుతుంటాయి.
వెండి మాత్రం...
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై కేవలం పది రూపాయలు మాత్రమే తగ్గింది. వెండి ధరలు మాత్రం భారీగా పెరిగాయి. కిలో వెండి ధరపై ఐదు వందల రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 54,990 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 59,990 రూపాయలుగా కొనసాగుతుంది. ఇక వెండి ధర మాత్రం కిలో 77,500 రూపాయల వద్ద ట్రెండ్ అవుతుంది. బంగారం ధరలు మరింత పెరిగే అవకాశముందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.


Tags:    

Similar News