YSRCP : నేడు వైసీపీ నిరసనలు...మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నేడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆందోళనలకు వైసీపీ పిలుపునిచ్చింది.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నేడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆందోళనలకు వైసీపీ పిలుపునిచ్చింది. మెడికల్ కాలేజీల దగ్గర ధర్నా చేయనున్నట్లు వైసీపీ నేతలు ప్రకటించారు. దీంతో ఆ యా ప్రాంతాల్లో పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేశారు. దీంతో పాటు నేడు మెడికల్ కాలేజీల అంశంపై అసెంబ్లీ లోపల.. బయట వైసీపీ నిరసనలు తెలపాలని వైసీపీ నిర్ణయించింది. శాసన మండలిలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ వాయిదా తీర్మానం ఇవ్వనుంది. దీనిపై చర్చ జరపాలని పట్టుబట్టనుంది.
పోలీసుల ముందస్తు అరెస్ట్ లు...
బయట చలో మెడికల్ కాలేజీల కార్యక్రమానికి వైసీపీ పిలుపు నివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వైసీపీ నిరసనలకు పోలీసులు అనుమతి లేదని చెబుతున్నారు. అనేక మంది వైసీపీ నేతలను ఇప్పటికే పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుకు పోలీసుల నోటీసులు ఇచ్చారు. చలో మెడికల్ కాలేజీల కార్యక్రమానికి వెళ్లొద్దంటూ వేణు ఇంటికి వచ్చి పోలీసులు నోటీసులు ఇచ్చారు. అలాగే మాజీమంత్రి విడదల రజినిని కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. సెక్షన్ 30 అమలులో ఉన్నందున ఎవరూ ఆందోళన చేయడానికి వీలులేదని చెప్పారు.