Ys Jagan : నేడు గుంటూరు లో జగన్ పర్యటన

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు

Update: 2026-02-04 02:19 GMT

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు ఇంటికి ఉదయం పది గంటలకు బయలుదేరి వెళ్లనున్నారు. అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. గుంటూరులోని అంబటి రాంబాబు నివాసంలో జరిగిన టీడీపీశ్రేణుల విధ్వంసాన్ని జగన్ పరిశీలించనున్నారు.

అంబటి రాంబాబు కుటుంబాన్ని...
అనంతరం అంబటి భార్య, కుటుంబ సభ్యులతో మాట్లాడతారు. పార్టీ వారికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇవ్వనున్నారు. అంబటి రాంబాబు ఇంటిపై ఇటీవల టీడీపీ శ్రేణులు దాడులు చేసి విధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అంబటి రాంబాబు రాజమండ్రి జైలులో ఉన్నారు. జగన్ పరామర్శకు వస్తుండటంతో పెద్దయెత్తున పార్టీ శ్రేణులు తరలి వచ్చే అవకాశముందని భావించి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.


Tags:    

Similar News