Ys Jagan : చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే.. ఇంత పచ్చిమోసమా?

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేశారని వైసీపీ అధినేత జగన్ అన్నారు.

Update: 2025-03-05 06:04 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేశారని వైసీపీ అధినేత జగన్ అన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షం చెబుతున్న మాటలను పట్టించుకోవడం లేదన్నారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అధికార పక్షం సభలో ఏం చెప్పినా అబద్ధమని, మోసమని అన్నారు. ఎన్నికల సమయంలో ఎన్నో వాగ్దానాలు చేసినా వాటిని అమలు చేయడంలో మాత్రం చిత్తశుద్ధి కనిపించడం లేదన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన చంద్రబాబు హామీలకు ఎంత కేటాయించారని జగన్ ప్రశ్నించారు. రెండు బడ్జెట్ లలోనూ చంద్రబాబు ప్రజలను దారుణంగా మోసం చేశారని వైఎస్ జగన్ ఆరోపించారు. చెప్పిన దానికి, చేసేదానికి పొంతన లేదన్నారు.

సూపర్ సిక్స్ అంటూ...
సూపర్ సిక్స్ అంటూ ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు తర్వాత వాటి ఊసు మర్చిపోయారని వైఎస్ జగన్ అన్నారు. బడ్జెట్ లో నిరుద్యోగ భృతి గురించి ప్రస్తావన కూడా లేదన్నారు. బడ్జెట్ లో సూపర్ సిక్స్ అరకొర కేటాయింపులు చేశారన్నారు. తొమ్మిది నెలల్లోనే నాలుగున్నర లక్షల ఉద్యోగాలు ఇచ్చామని గవర్నర్ ప్రసంగంలో చెప్పారని, అయితే గవర్నర్ చేత అబద్ధాలు చెప్పించారని అన్నారు. ఆర్థిక సర్వేలోనూ 27 లక్షల ఉద్యోగాలు ఇచ్చేశామని పేర్కొనడం ఇంతకంటే దారుణం ఉంటుందా? అని ప్రశ్నించారు. ఇంత దారుణంగా నిరుద్యోగులను మోసం చేశారని, మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇవ్వకుండా ఉపాధి అవకాశాలు కల్పించారని ఎలా చెబుతారని ఆయన ప్రశ్నించారు.
ఉచిత బస్సు ఎక్కడ?
వైసీపీ హయాంలో కేవలం నాలుగు నెలల కాలంలోనే 1.30 వేల ఉద్యోగాలు ఇచ్చామని, అవి ప్రభుత్వ ఉద్యోగాలను ఇచ్చామని తెలిపారు. అలాగే రెండున్నర లక్షల మందిని వాలంటీర్లుగా నియమించామని చెప్పారు. ఆప్కాస్ ద్వారా మరో 90 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని జగన్ అన్నారు. ఆర్టీసీ విలీనం ద్వారా వేలమంది ఉద్యోగులను ఊరట కల్పించామని చెప్పారు. ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వ ఉద్యోగాలే 6.31 లక్షల మందికి ఇచ్చామని తెలిపారు. 18 నుంచి అరవై ఏళ్ల లోపు ఉన్న ప్రతి మహిళకు ఏడాదికి పద్దెనిమిదివేలు ఇస్తామని అన్నారని, దాని ఊసే లేదని వైఎస్ జగన్ అన్నారు. ప్రతిమహిళకు చంద్రబాబు ఇప్పటి వరకూ 36 వేలు బాకీ ఉన్నారన్నారు. ఉచిత బస్సు పథకాన్ని కూడా అమలు చేయడం లేదన్నారు.


Tags:    

Similar News