Ys Jagan : నేడు భీమవరానికి జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు.

Update: 2026-02-05 02:58 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని భీమవరంలో వైఎస్ పర్యటన కొనసాగుతుంది. శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజు కుమారుడి వివాహానికి వైఎస్ జగన్ హాజరు కానున్నారు. ఉదయం పదిన్నర గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి జగన్ భీమవరం చేరుకుంటారు.

నేతలతో భేటీ...
అక్కడి నుంచి పెదఅమిరం చేరుకుని శ్రీ రాధాకృష్ణ కన్వెన్షన్ హాలులో జరిగే వివాహ వేడుకలో వైఎస్ జగన్ పాల్గొననున్నారు. వధూవరులను ఆశీర్వదించిన అనంతరం తిరిగి బయలుదేరి మధ్యాహ్నం పన్నెండు గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. అనంతరం అందుబాటులో ఉన్న నేతలతో సమావేశమవుతారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తారు.


Tags:    

Similar News