Kakani Govardhan Reddy : కాకాణి గోవర్థన్ రెడ్డి అరెస్ట్
వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు
kakani govarthan reddy
వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత రెండు నెలల నుంచి అజ్ఞాతంలో ఉన్న కాకాణి గోవర్థన్ రెడ్డి కోసం గాలింపు చర్యలు ఫలించాయి. నిన్న కర్ణాటకలో నెల్లూరు పోలీసులు కాకాణి గోవర్థన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసిన కాకాణిని నెల్లూరుకు తీసుకు వచ్చారు. కాకాణి గోవర్థన్ రెడ్డిపై అక్రమ మైనింగ్ తో పాటు ఎస్సీ, ఎస్టీ కేసులు కూడా నమోదు కావడంతో ఆయన గత రెండు నెలల నుంచి తప్పించుకు తిరుగుతున్నారు.
రెండు నెలల నుంచి...
ఆయన కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. అయినా ఫలితం లేకుండా పోయింది. హైకోర్టులో, సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ వేసినప్పటికీ కాకాణి గోవర్థన్ రెడ్డికి చుక్కెదురు అయింది. అయినా సరే కాకాణి గోవర్థన్ రెడ్డి ఆచూకీ దొరకలేదు. అయితే చివరకు ఎట్టకేలకు కాకాణి గోవర్థన్ రెడ్డి దొరకడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నట్లయింది. ఆయనను నేడు కోర్టులో ప్రవేశపెట్టే అవకాశముంది. ఈ కేసులో విచారణ నిమిత్తం కస్టడీ పిటీషన్ వేసే ఛాన్స్ ఉంది.