Ys Jagan : నేడు పల్నాడు జిల్లాకు జగన్

వైసీపీ అధినేత వైఎఎస్ జగన్ నేడు పల్నాడు జిల్లాకు వెళ్లనున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో రెంటపాళ్ల గ్రామంలో పర్యటించనున్నారు

Update: 2025-06-18 01:41 GMT

వైసీపీ అధినేత వైఎఎస్ జగన్ నేడు పల్నాడు జిల్లాలో పర్యటిస్తున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో రెంటపాళ్ల గ్రామంలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు బయలేదేరి ఆయన పది గంటలకు రెంటపాళ్ల గ్రామానికి చేరుకుంటారు. అక్కడ వైసీపీ కార్యకర్త, గ్రామ ఉప సర్పంచ్ నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించనున్నారు.

కుటుంబాన్ని పరామర్శించి...
నాగమల్లేశ్వరరావు ఉప సర్పంచ్ గా ఉండి వేధింపులకు పాల్పడలేక ఆత్మహత్యకు పాల్పడటంతో జగన్ ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళుతున్నారు. అక్కడ నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించనున్నారు. అయితే పోలీసులు కేవలం వంద మందికి మాత్రమే జగన్ త పాటు పర్యటనకు అనుమతించారు. కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం అక్కడి నుంచి బయలుదేరి తిరిగి తాడేపల్లి చేరుకుంటారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.


Tags:    

Similar News