Ys Jagan : నేడు విజయవాడకు వైఎస్ జగన్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు విజయవాడలోని కృష్ణలంకకు వెళ్లనున్నారు. కృష్ణలంకలోని నిర్మలా శిశుభవన్ కు జగన్ వెళ్లనున్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు విజయవాడలోని కృష్ణలంకకు వెళ్లనున్నారు. కృష్ణలంకలోని నిర్మలా శిశుభవన్ కు జగన్ వెళ్లనున్నారు. నిర్మలా శిశుభన్ లో ఉన్న అనాధ పిల్లలతో జగన్ కాసేపు గడపనున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ జగన్ నిర్మలా శిశుభవన్ ను సందర్శించి అక్కడి పిల్లలతో కాసేపు గడిపారు.
భారీ భద్రత...
ఈరోజు కూడా జగన్ నిర్మలా శిశుభవన్ కు వస్తుండటంతో భారీగా ఏర్పాట్లు చేశారు. పెద్దయెత్తున కార్యకర్తలు తరలి వచ్చే అవకాశముండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిర్మలా శిశుభవన్ లోకి జగన్ తో పాటు అనుమతి పొందిన నేతలకు మాత్రమే ప్రవేశం ఉంటుందని పోలీసులు తెలిపారు. భద్రతా ఏర్పాట్లు చేశారు.