Ys Jagan : రేపటి జగన్ సత్తెనపల్లి పర్యటనకు అనుమతి నో

రేపు వైసీపీ అధినేత వైఎస్ జగన్ సత్తెనపల్లిలో పర్యటించాల్సి ఉంది. ఆయన పర్యటనకు పోలీసులు అనుమతించలేదు

Update: 2025-06-17 02:34 GMT

రేపు వైసీపీ అధినేత వైఎస్ జగన్ సత్తెనపల్లిలో పర్యటించాల్సి ఉంది. ఆయన పర్యటనకు పోలీసులు అనుమతించలేదు. సత్తెనపల్లిలో జగన్ టూర్ కు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను తమకు పార్టీ నుంచి అందలేని పోలీసులు చెబుతున్నారు. శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశముందని భావించి జగన్ పర్యటనకు తాము అనుమతి ఇవ్వడం లేదని పోలీసులు తెలిపారు.

అనుమతి పత్రాలు ఇస్తేనే...
తాము అడిగిన పత్రాలను ఇస్తే మరోసారి జగన్ పర్యటనపై అనుమతికి పరిశీలిస్తామని చెప్పారు. గతంలో జరిగిన ఘటనల దృష్ట్యా పర్యటనకు అనుమతి ఇవ్వడం లేదని పల్నాడు ఎస్పీ ప్రకటించారు. దీనిపై వైసీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తాము అన్ని పత్రాలు సమర్పించినప్పటికీ పోలీసులు కావాలని అనుమతిని నిరాకరించారని అన్నారు.


Tags:    

Similar News