Ys Jagan : నేడు జగన్ నేడు కీలక సమావేశం
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు కీలక సమావేశం నిర్వహిస్తున్నారు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో జగన్ భేటీ కానున్నారు. రామచంద్రాపురం, పార్వతీపురం మున్సిపాలిటీలకు చెందిన వైసీపీ ప్రజాప్రతినిధులతో పాటు గ్రేటర్ విశాఖ కార్పొరేటర్లు, రామగిరి మండలం ఎంపీటీసీ సభ్యులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు.
రానున్నది మన ప్రభుత్వమేనంటూ...
వరసగా కూటమి ప్రభుత్వం వైసీపీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లను, ఎంపీపీలను లోబర్చుకుని వైసీపీ నుంచి అధికారాన్ని లాగేసుకుంటుండటంతో వీరితో భేటీ అయి వారిలో భరోసా కల్పించనున్నారు. తిరిగి అధికారంలోకి వచ్చేది తామేనని జగన్ చెప్పి వారు ఇతర పార్టీల వైపునకు వెళ్లకుండా అవసరమైన చర్యలు తీసుకునేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.