Ys Jagan : టెన్షన్ మధ్య సాగుతున్న జగన్ పర్యటన.. కాన్వాయ్ దిగేందుకు అంగీకరించని పోలీసులు

వైసీపీ అధినేత జగన్ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం చేరుకున్నారు.

Update: 2025-07-09 06:23 GMT

వైసీపీ అధినేత జగన్ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం చేరుకున్నారు. హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న జగన్ కు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. పోలీసుల ఆంక్షల మధ్య జగన్ పర్యటన కొనసాగుతుంది. బంగారుపాళ్యం మార్కెట్ యార్డుకు మరికొద్దిసేపట్లో చేరుకోనున్నారు. బంగారుపాళ్యం వచ్చే అన్ని దారుల్లో పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. బంగారుపాళ్యం దగ్గర జగన్ కారు దిగేందుకు ప్రయత్నించగా పోలీసుల అడ్డుకున్నారు. కార్యకర్తలను పోలీసులు లాఠీ ఛార్జి చేయడంతో గాయాలు కాగా పరామర్శించేందుకు జగన్ కారు దిగేందుకు ప్రయత్నించగా అందుకు పోలీసులు అంగీకరించకుండా పంపించి వేశారు.

పెద్ద సంఖ్యలో తరలి రావడంతో...
అయితే పొలాల్లో నుంచి బైకులపై బంగారుపాళ్యానికి కార్యకర్తలు చేరుకుంటుండటంతో పెద్దయెత్తున కార్యకర్తలు తరలి వచ్చే అవకాశముంది. బంగారు పాళ్యం మార్కెట్ యార్డులోకి కేవలం ఐదు వందల మందికి మాత్రమే అనుమతిస్తారని చెప్పినా ఇప్పటికే అంతకు మించి అక్కడ చేరడంతో పోలీసులు చేతులెత్తేసినట్లు కనిపిస్తుంది. కేసులు పెడతామని, రౌడీషీట్లు తెరుస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నా ఫలితం లేకుండా పోతుంది. మొత్తం మీద జగన్ పర్యటన బంగారుపాళ్యంలో ఉద్రిక్తతల మధ్య కొనసాగుతుంది.


Tags:    

Similar News