చంద్రబాబు అందుకే నాకు టిక్కెట్ ఇవ్వలేదు
ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఈర్లే శ్రీరామమూర్తి తెలుగుదేశం పార్టీ పై సంచలన కామెంట్స్ చేశారు.
ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఈర్లే శ్రీరామమూర్తి తెలుగుదేశం పార్టీ పై సంచలన కామెంట్స్ చేశారు. టీడీపీ తనకు టిక్కెట్ ఇవ్వకపోయినా తాను స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. ఉత్తరాంధ్ర పట్టభద్రులు తనను ఆశీర్వదించాలని ఆయన కోరారు. తాను 1982లో రాజకీయాల్లోకి ఎన్టీఆర్ స్ఫూర్తితో వచ్చానని, 1985లో తెలుగుదేశం పార్టీలో చేరానని తెలిపారు. టీడీపీకి అనేక ఏళ్లపాటు సేవలందించినా తనకు టిక్కెట్ ఇవ్వకపోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అయన్న కారణంగానే...
తెలుగుదేశం పార్టీలోని కొందరు సీనియర్ నాయకులు తనకు టిక్కెట్ రాకుండా అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తన రాజకీయ ఎదుగుదలకు అడ్డుగా మారారని చెప్పుకొచ్చారు. నలభైఐదేళ్లుగా తీను ఉద్యోగ సంఘాలతో కలసి పనిచేశానని, టీడీపీ అధినేత చంద్రబాబు తనకు టిక్కెట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ సీనియర్ నేతల కారణంగానే ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని మార్చి తన నియోజకవర్గంలో టీడీపీలో సభ్యత్వంలేని వారికి టిక్కెట్ ఇచ్చారని ఆయన ఆరోపించారు.