Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు సంక్రాంతి సెలవులు ఖరారు

ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు సంక్రాంతి సెలవులు ఖరారు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Update: 2025-12-26 04:36 GMT

ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు సంక్రాంతి సెలవులు ఖరారు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. సంక్రాంతి ఏపీకి పెద్ద పండగ కావడంతో విద్యార్థులకు ఎక్కువ రోజులు సెలవులు ప్రకటించారు. జనవరి 10వ తేదీ నుంచి జనవరి 18వ తేదీ వరకు 9 రోజులు పాటు ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలకు సంక్రాంతి పండుగ సెలవును అధికారులు ప్రకటించారు

తిరిగి ప్రారంభమయ్యేది...
జనవరి 19 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి. అన్ని ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థలు ఈ సెలవులను ఖచ్చితంగా పాటించాలని విద్యాశాఖ అధికారులు ఆదేశించారు. ఆదేశాలను అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సంక్రాంతి సెలవులకు సొంతూళ్లకు వెళ్లే విద్యార్థులు తిరిగి చేరుకునేందుకు సమయం కూడకా ఇచ్చారు.


Tags:    

Similar News