Andhra Pradesh : ఉచిత బస్సుకు నిధులు విడుదల
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కోసం ఆంధ్రప్రదేనశ్ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కోసం ఆంధ్రప్రదేనశ్ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. స్త్రీ శక్తి పథకానికి 800 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నవంబర్ నుంచి మార్చి 2026 వరకు స్త్రీ శక్తి పథకం అమలు కోసం నిధులు మంజూరు చేసినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నెలకు 160 కోట్ల రూపాయల చొప్పున ఐదు నెలలకు ముందస్తుగా నిధులను ప్రభుత్వం విడుదల చేసింది.
800 కోట్లను...
ఆంధ్రప్రదేశ్ లో ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి స్త్రీశక్తి పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు ఇప్పటికే 400 కోట్ల రూపాయలు విడుదల చేసింది. పథకం సమర్థంగా అమలు చేసేందుకు ముందస్తుగా నిధులు విడుదల చేయాని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొన్ని లక్షల మంది ఈ పథకాన్ని వినియోగించుకుంటున్నారని ప్రభుత్వం తెలిపింది.